టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, మాస్ ఎనర్జిటిక్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న పవర్-ప్యాక్డ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి'. ఈ రోజు ( ఆగస్టు 28, 2026 ) రాఖీ పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'గంగ ఒక్కడే… ప్రాణాలు ఐదు' అనే ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ క్యాప్షన్‌తో వచ్చిన ఈ లుక్‌లో శర్వానంద్ మునుపెన్నడూ చూడని రస్టిక్ అవతారంలో మెరిశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్ షేక్ చేస్తోంది.
తెలంగాణ గ్రామీణ వాతావరణంలో.. చేతిలో తాటి ముంజల కత్తితో శర్వానంద్ కనిపిస్తున్న తీరు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో 1960ల కాలంలో సాగే పచ్చి మాస్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంపత్ నంది మార్క్ హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌కి, అప్యాయతలు-అనుబంధాల సెంటిమెంట్ తోడవడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
ఈ 'భోగి' మూవీలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. తన మాస్ మ్యూజిక్‌తో థియేటర్లను ఊపేసే భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి అదిరిపోయే పాటలు, సాలిడ్ బీజీఎమ్ అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కె.కె. రాధామోహన్ ఎక్కడా రాజీ పడకుండా విజువల్ వండర్‌గా ఈ పీరియాడిక్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం 1960ల కాలం నాటి తెలంగాణ విలేజ్ అట్మాస్ఫియర్ విజువల్‌గా పర్ఫెక్ట్‌గా రావడం కోసం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శర్వానంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. శర్వానంద్ గెటప్ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఖాయంగా కనిపిస్తోందంటున్నారు ఫ్యాన్స్..
“గంగ” ఒక్కడే... ప్రాణాలు ఐదు❤️
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 28, 2026
Happy #RakshaBandhan to everyone from Team #BHOGI ❤️🔥#SharwaSampathBloodFest in cinemas soon 🔥 pic.twitter.com/xZBrizgJ6p
