శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బైకర్’. రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రెట్టీ బేబీ’ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసిన మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. జిబ్రాన్ ఈ పాటను కంపోజ్ చేయడంతోపాటు యాజిన్ నిజార్, సుభాషినితో కలిసి పాడాడు. కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి.
‘మై ప్రెట్టీ బేబీ.. బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది.. వెదర్ చూస్తే కూల్‌గా ఉంది బేబీ.. నెక్స్ట్ లెవల్ స్టైల్ నీది, పల్స్ రేటు పెంచుతుంది బేబీ.. షార్ట్ డ్రెస్, హాట్ లుక్స్, రెడ్ లిప్స్, స్లిమ్ హిప్స్ బ్యూటీ..’ అంటూ సాగిన పాటలో శర్వా, మాళవిక నాయర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కలర్‌ఫుల్ విజువల్స్, వీరిద్దరి డ్యాన్స్ మూమెంట్స్ స్టైలిష్‌గా ఉన్నాయి. 1990, 2000 బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ మూవీ రేసింగ్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని మేకర్స్ చెప్పారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 6న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
