Shikhar Dhawan: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్– అతనికి కాబోయే భార్య సోఫీ షైన్ తో కలిసి సంగీత్ వేడుకల్లో చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో ధావన్– సోఫీ షైన్‌తో కలిసి ధురంధర్ సినిమాలోని ‘షరారత్’ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ డ్యాన్స్ ను వివాహానికి హాజరైన వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, ఈ జంట తమ మెహందీ వేడుకకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంది. మెహందీ ఫంక్షన్‌లో సోఫీ షైన్ తన చేతులపై అందంగా మెహందీ డిజైన్లను వేసుకోవడం కనిపించింది. ఈ వేడుక కోసం ఆమె సంప్రదాయ దుస్తులను పక్కనపెట్టి, సౌకర్యవంతమైన ట్యాంక్ టాప్, బాటమ్స్‌ను ఎంచుకోవడం విశేషం.
ఇంతకు ముందు, శిఖర్ ధావన్ సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ.. “Sangeet night almost the Dhawans” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ మాటలు త్వరలో జరగబోయే పెళ్లికి సంకేతమివ్వడంతో అభిమానుల్లో మరింత ఉత్సహాన్నినింపినట్లైంది. ఇది శిఖర్ ధావన్‌కు రెండో వివాహం కావడం గమనార్హం. గతంలో ఆయన ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు జోరావర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.
అయేష ముఖర్జీ– శిఖర్ ధావన్ తో వివాహ జీవితం 2023లో విడాకులతో ముగిసింది. విడాకుల అనంతరం తన కుమారుడితో అనుబంధాన్ని కొనసాగించడంలో ఎదురైన వ్యక్తిగత సవాళ్ల గురించి ధావన్ గతంలో బహిరంగంగానే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న గబ్బర్– సోఫీ షైన్ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంగీత్ వేడుకలో వారి ఆనందం, ఇద్దరీ మధ్య కెమిస్ట్రీ చూసి “ఇదే నిజమైన సెలబ్రేషన్” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
— amertha.work (@amerthawork) February 20, 2026
