V6 News

ట్రంప్ కార్యక్రమంలో కాల్పులు జరిపింది ఇతడే.. గుడ్డలు ఊడదీసి నేలపై పడుకొబెట్టారు..!

ట్రంప్ కార్యక్రమంలో కాల్పులు జరిపింది ఇతడే.. గుడ్డలు ఊడదీసి నేలపై పడుకొబెట్టారు..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్ కార్యక్రమంలో కాల్పుల ఘటనతో అగ్ర రాజ్యం అమెరికా ఉల్కిక్కిపడింది. ఈ ఊహించని పరిణామంతో భద్రతా దళాలు హై అలర్ట్ అయ్యాయి. నిమిషాల్లోనే హొటల్ ను అదుపులోకి తీసుకుని కాల్పులు జరిపిన దుండగుడిని భద్రత దళాలు వెంటాడి పట్టుకున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న షూటర్ ఫొటోను ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో నిందితుడిని చొక్కా లేకుండా, చేతులు కట్టేసి నేలపై బొర్లా పడుకోబెట్టాయి భద్రతా దళాలు. నిమిషాల్లోనే  నిందితుడిని పట్టుకున్న భద్రతా దళాలను ట్రంప్ ప్రశంసించారు.

అసలేం జరిగిందంటే..?

 శనివారం (ఏప్రిల్ 25) వాషింగ్టన్‎లోని హిల్టన్ హోటల్‎లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్‎కు ప్రెసిడెంట్ ట్రంప్ డిన్నర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సహా సుమారు 2,600 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డిన్నర్ మీట్ కొనసాగుతుండగా ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్ధం తీవ్ర కలకలం రేపింది. 

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్‎ను అత్యవసరంగా హోటల్ నుంచి బయటకు తరలించారు. కాల్పుల శబ్ధంతో భయాందోళనకు గురైన గెస్ట్‎లు టేబుళ్ల కింద దాక్కుకున్నారు. ఘటన స్థలంలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు హోటల్‎ను ఆధీనంలోకి తీసుకున్నాయి.

కాల్పులు జరిపిన నిందితుడిని సెక్యూరిటీ ఫోర్సెస్ చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు జరిగినట్టు గుర్తించారు. ట్రంప్ సహా కీలక నేతలు అంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

భద్రతా సిబ్బంది తీరు అద్భుతం: ట్రంప్

 వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కలకలం రేపిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లా్ట్‏ఫామ్ ట్రూత్ సోషల్‎లో పోస్ట్ పెట్టారు. సీఐఏ ఏజెంట్స్, పోలీస్ విభాగం అద్భుతంగా పని చేసిందని ప్రశంసించారు. కాల్పుల సమయంలో భద్రతా సిబ్బంది చాలా వేగంగా, ధైర్యంగా స్పందించారన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు.