ఇకపై అలాంటి సినిమాలు చేయను.. శివ కార్తికేయ షాకింగ్ డెసిషన్

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. శివ కార్తికేయ షాకింగ్ డెసిషన్

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Shiva Karthikeyan) గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ఆడియన్స్ కూడా ఆయన సినిమాలనే చాలా ఇష్టపడతారు. ఆయన హీరోగా వచ్చిన వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు సినిమాలు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. దాంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. 

అయితే శివ కార్తికేయన్ తాజాగా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అయలన్(Ayalaan). సైన్స్‌ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీని ఆర్‌.రవికుమార్(R Ravikumar) తెరకెక్కిస్తుండగా.. ఏఆర్ రహమాన్(AR Rahaman) సంగీతం అందిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శివ కార్తికేయన్ తన తదుపరి సినిమాల ఎంపిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక నుండి ఏ సర్టిఫికెట్ సినిమాలు చేయనని, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరు కలిసి చూసే సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చారు శివ కార్తికేయన్. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే.. తమ హీరోను అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ లో చూసే వీలుండదు కాబట్టి. మరి శివ కార్తికేయన్ కు ఫ్యాన్స్ ఏమైనా స్పెషల్ రిక్వెస్ట్ చేస్తారేమో చూడాలి.