శివకుమార్ హీరోగా ప్రశాంత్ నామిని దర్శకత్వంలో అనిల్ ఈరుగుదిండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘సువర్ణ టెక్స్‌టైల్’. డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
లేటెస్ట్ గా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. టీజర్ మొత్తం రొమాంటిక్ డోస్ తో నిండి ఉంది. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు డైరెక్టర్ ప్రశాంత్. హీరోకి ఉండే వింత వీక్ నెస్.. దానివల్ల పడే కష్టాలు, సూపర్ పవర్ యూత్ ని ఆకట్టుకునేలా ఉంది.
అతిథులుగా హాజరైన దర్శకుడు వేణు ఊడుగుల, హీరో సోహైల్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం దర్శకుడు హైటెక్ సిటీ వీధుల్లో నైటీ వేసుకుని పరిగెత్తించాడు. ఈ చిత్రం యూత్‌కు బాగా నచ్చుతుంది’ అని అన్నాడు. కొంత అడల్ట్ ఉన్నా.. కొత్త జానర్‌లో ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ చెప్పాడు. టీమ్ అంతా పాల్గొన్నారు.
