'పెద్ది' నుంచి తప్పుకుందామనుకున్న శివరాజ్ కుమార్.. రామ్ చరణ్, బుచ్చిబాబు ఏం చేశారంటే?

'పెద్ది' నుంచి తప్పుకుందామనుకున్న శివరాజ్ కుమార్.. రామ్ చరణ్, బుచ్చిబాబు ఏం చేశారంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న  ప్రతిష్టాత్మక చిత్రం'పెద్ది' (Peddi). జూన్ 4న ఈ సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా  గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అటు ప్రమోషన్స్ కూడా దేశవ్యాప్తంగా చేపట్టారు.. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను రెట్టింపు స్థాయిలో నెలకొన్నాయి. మరో వైపు ఈ రోజు ( జూన్ 1న ) విజయవాడలో భారీ ఎత్తున ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. 

శివన్న ఎమోషనల్

ఈ తరుణంలో.. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ మాట్లాడిన మాటలు ఫ్యాన్స్ కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఆయన దాదాపు తప్పుకోవాలనుకున్నానని చెప్పుకొచ్చారు. శివన్న జీవితంలో ఎదురైన చీకటి రోజులు, ఆయనను ఎంతగా కుంగదీశాయో.. అంతకంటే పవర్‌ఫుల్‌గా ఆయన తిరిగి పుంజుకున్న తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.

క్యాన్సర్‌తో పోరాటం.. 

డైరెక్టర్ బుచ్చిబాబు సనా 'పెద్ది' కథ చెప్పగానే పిచ్చగా నచ్చేసింది. రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆయన ఎంతో ఎగ్జైట్ అయ్యానని  శివన్న చెప్పుకొచ్చారు. కానీ, సీన్ కట్ చేస్తే 2024లో ఆయనకు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. అమెరికాలోని మయామిలో బ్లేడర్ రిమూవల్ సర్జరీ జరిగి, ప్రేగులతో కృత్రిమ మూత్రాశయాన్ని అమర్చారు డాక్టర్లు. ఈ హెల్త్ క్రైసిస్ వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతుందని, ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటానని మేకర్స్‌తో చెప్పినట్లు శివరాజ్ కుమార్ తెలిపారు.

కానీ ఇక్కడే 'పెద్ది' టీమ్ తమ లాయల్టీని నిరూపించుకుంది. 'నువ్వు లేకపోతే ఈ సినిమాలో ఆ క్యారెక్టరే వద్దు.. ఎంత కాలమైనా నీ కోసమే వెయిట్ చేస్తాం' అంటూ బుచ్చిబాబు, రామ్ చరణ్, ప్రొడ్యూసర్స్ శివన్నకు కొండంత అండగా నిలిచారు. కీమోథెరపీ తీసుకుంటూనే, నీరసాన్ని పక్కన పెట్టి తన కన్నడ సినిమా '45' షూటింగ్‌తో పాటు 'పెద్ది' షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు శివన్న.

 'జైలర్' స్వాగ్‌కు చరణ్ ఫిదా..

ఈవెంట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ శివన్నపై ప్రశంసల జల్లు కురిపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్'సినిమాలో శివన్న చేసిన క్యామియో రోల్‌ను తాను వందల సార్లు చూశానని చరణ్ క్రేజీ కామెంట్స్ చేశారు. శివన్న స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కళ్లల్లోని పవర్ మరే నటుడిలోనూ చూడలేమన్నారు.

బాక్సాఫీస్ షేక్ ఖాయమేనా..

ప్రస్తుతం క్యాన్సర్‌ను జయించి, పూర్తి ఫిట్‌నెస్‌తో సింహంలా గర్జిస్తున్నారు శివ రాజ్ కుమార్.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న 'పెద్ది' సినిమాతో పాటు, ఆయన త్వరలోనే రజనీకాంత్‌తో కలిసి 'జైలర్ 2' లో కూడా రచ్చ లేపడానికి రెడీ అవుతున్నారు. రియల్ లైఫ్‌లోనే ఇంత పెద్ద ఫైట్ గెలిచిన శివన్న, ఇక రీల్ లైఫ్‌లో రామ్ చరణ్‌తో కలిసి బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తారో చూడాలి..