హైలెస్సో మూవీ నుంచి శివాజీ ఫస్ట్ లుక్ రిలీజ్

హైలెస్సో మూవీ నుంచి శివాజీ ఫస్ట్ లుక్ రిలీజ్

డిఫరెంట్ కంటెంట్‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌‌లో ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు శివాజీ. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న చిత్రాల నుంచి స్పెషల్ పోస్టర్స్‌‌తో బర్త్‌‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్. వాటిలో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న  ‘హైలెస్సో’ చిత్రం నుంచి విడుదలైన శివాజీ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. 

ఇందులో ఆయన లైలం బాబు అనే పవర్‌‌‌‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నట్టు టీమ్ రివీల్ చేసింది.  బ్లాక్ షర్ట్, వైట్ పంచెతో  రాతి సింహాసనంపై కూర్చొని, చేతిలో  సీసా పట్టుకుని శివాజీ కనిపించిన తీరు ఆయన పాత్రలోని పవర్‌‌‌‌ని చూపిస్తోంది.  ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో  గ్రామీణ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  కన్నడ నటి అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తోంది. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు.  అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్న ఈ  చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.