కాలేజ్ డేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తుచేసేలా లిటిల్ హార్ట్స్..

కాలేజ్ డేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తుచేసేలా లిటిల్ హార్ట్స్..

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో మంచి  గుర్తింపును అందుకున్న తెలుగు హీరోయిన్ శివానీ నాగరం నటించిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. మౌళి తనూజ్ హీరోగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్, సాయి కృష్ణ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలవుతోంది. 

ఈ సందర్భంగా శివానీ నాగరం మాట్లాడుతూ ‘‘నా ఫస్ట్ మూవీలో  లవ్ స్టోరీతో పాటు ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది.  ఇది మాత్రం  కంప్లీట్ లైట్ హార్టెడ్ మూవీ.  కాలేజ్ డేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే ఫన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సాగుతుంది. లవ్ స్టోరీ ఉన్నా,  అందులో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉండవు. ఇందులో కాత్యాయని క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తా. నా పాత్ర అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. అఖిల్ (మౌళి), కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తున్న వారందరికీ కాలేజ్ డేస్ గుర్తొస్తాయి.  మేమూ ఇలాగే ఉండేవాళ్లం అనిపిస్తుంది.  సినిమా ఎంత ఫన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందో, షూటింగ్ చేసేటప్పుడు కూడా అంతే హ్యాపీగా చేశాం. 

ఎక్కువమంది సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి అంతా ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా కలిసిపోయాం. రాజీవ్ కనకాల, అనిత చౌదరి, సత్యకృష్ణ..వీళ్లంతా సీనియర్స్ అయినా మాతో బాగా కలిసిపోయారు. మమ్మల్ని సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఎంకరేజ్ చేసేవారు.  బన్నీవాస్, వంశీ నందిపాటి చిన్న సినిమా అని చూడకుండా, మంచి కంటెంట్ ఉన్న సినిమా అని నమ్మి రిలీజ్ చేస్తున్నారు. ఈటీవి విన్ నుంచి వస్తున్న ఫస్ట్ థియేట్రికల్ మూవీ ఇదే కావడం విశేషం. నెక్స్ట్ సుహాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘హే భగవాన్’  మూవీలో నటిస్తున్నా. ఇదొక కంప్లీట్ హిలేరియస్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలు లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి’’ అని చెప్పింది.