డెకాయిట్‌‌‌‌ మూవీ టైటిల్‌‌‌‌ రివీల్

డెకాయిట్‌‌‌‌ మూవీ టైటిల్‌‌‌‌ రివీల్

అతి దగ్గరగా వినిపిస్తున్న తుపాకీ చప్పుళ్లు.. బాంబు దాడుల తర్వాత భగ్గున మండుతున్న వాహనాలు.. అక్కడక్కడా పోలీసుల శవాలు. వీటన్నింటి మధ్య.. జూలియట్ ఎన్నేళ్లయింది మనం కలిసి అంటూ అడివి శేష్ ఎంట్రీ. ‘కలిసి కాదు... విడిపోయి' అంటూ బదులిచ్చింది శ్రుతిహాసన్.  చీరకట్టులో కనిపిస్తున్న ఆమె చేతిలో తుపాకి ఉంది. 

అసలు నేను నీకు గుర్తున్నానా అంటూ అతను.. నీ మోసం మర్చిపోలేదు అంటూ ఆమె. అయితే ఇప్పుడు నేను ఏంటి నీ ఎక్స్‌‌‌‌నా అని అతడు... అది ఒకప్పుడు అని బదులిచ్చిందామె. మరిప్పుడు.. వెధవనా, దొంగనా, విలన్‌‌‌‌నా.. చెప్పు నేనెవరిని అని ప్రశ్నించాడు. ఇద్దరూ ఎదురెదురుగా తారసపడ్డారు. ఆమె అతనిపైకి తుపాకీని ఎక్కుపెట్టింది. అతను పిస్టల్‌‌‌‌తో ఆమెకు గురిపెట్టాడు. 

కట్ చేస్తే ‘డెకాయిట్‌‌‌‌’ అంటూ ఈ సినిమా టైటిల్‌‌‌‌ను రివీల్ చేశారు.  ‘ఒక ప్రేమ కథ’ అనేది ట్యాగ్‌‌‌‌లైన్. శత్రువులుగా మారిన ప్రేమికుల కథ ఇదని టీజర్‌‌‌‌‌‌‌‌ ద్వారా టైటిల్‌తో పాటు  కాన్సెప్ట్‌‌‌‌ను రివీల్ చేశారు. ఈ పాన్‌‌‌‌ ఇండియా మూవీతో షానీల్‌‌‌‌ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌‌ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు.  సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తు న్నాడు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.