సినీ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా..?

సినీ నటుడు టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా..?

సినీ నటుడు టైగర్ ష్రాఫ్పై ముంబైలోని జుహు ప్రాంతంలో దుండగులు కాల్పులు జరిపారు. ఆదివారం సాయంత్రం బైక్పై వెళ్లిన ముగ్గురు వ్యక్తులు టైగర్ ష్రాఫ్‌ కారులో ఎక్కేందుకు వెళుతుండగా అతనిపై కాల్పులు జరిపారు.

అయితే.. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ అలర్ట్ కావడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో అతని డ్రైవర్, మరో ఆటో డ్రైవర్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో అతను ఒక ఫుట్‌బాల్ మైదానం నుంచి బయటకు వస్తున్నట్లు సమాచారం.

అనిల్ పండిట్ అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి.. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడినని చెబుతూ.. టైగర్ ష్రాఫ్ తమ ఆదేశాలను పాటించడం లేదని, సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్నాడని.. అందుకే టైగర్ ష్రాఫ్ తమ హిట్ లిస్ట్‌లో ఉన్నాడని చెప్పాడు. గుజరాత్‌లోని జైలులో ఉన్న బిష్ణోయ్, సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని పదేపదే బెదిరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కాల్పుల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు 12 టీమ్స్గా ఏర్పడి గాలిస్తున్నారు. నటుడు టైగర్ ష్రాఫ్ క్షేమంగా ఉన్నాడని.. అతనికి ఎలాంటి బుల్లెట్ గాయం కాలేదని డీసీపీ మోహిత్ గార్గ్ చెప్పడంతో అతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జుహు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.