డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ శ్రద్దాకపూర్ సోదరుడు సిద్దాంత్

 డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ శ్రద్దాకపూర్ సోదరుడు సిద్దాంత్

బాలీవుడ్ యాక్టర్ శక్తి కపూర్ కుమారుడు, నటి శ్రద్ధాకపూర్ సోదరుడు  సిద్ధాంత్ కపూర్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో  పాజిటివ్ రావడంతో  బెంగళూరులో అరెస్టు చేసినట్లు పోలీసులు  తెలిపారు.  ఆదివారం రాత్రి బెంగళూరులోని పార్క్ హోటల్ పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీకి సిద్ధాంత్ కపూర్‌ను డిజెగా ఆహ్వానించారు. అక్కడ అతను డ్రగ్స్ సేవించాడు.  పక్కా సమాచారం మేరకు పోలీసులు హోటల్‌పై దాడి చేసి 35 మంది అతిథులకు వైద్య పరీక్షలు చేశారు. అందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్‌గా తేలింది. వారిలో శక్తి కపూర్ ఒకరని అధికారులు తెలిపారు.

సిద్ధాంత్ కపూర్‌తో సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారని... వారందరిపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద అభియోగాలు మోపారు’’ అని ఈస్ట్ డివిజన్ జిల్లా జనరల్ ఆఫ్ పోలీస్ భీమాశంకర్ ఎస్ గులేద్ తెలిపారు.  ఈ రోజు  ఆరుగురిని కోర్టు ముందు హాజరుపరుస్తామని మిస్టర్ గులేద్ చెప్పారు.