Team India T20 Captain: టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్!

Team India T20 Captain: టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్!

Team India T20 Captain: భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో టీమిండియాకి ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ చేరాడు. ఈ టోర్నమెంట్ తర్వాత అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడని, ఆటకు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. న్యూజిలాండ్ పై ఫైనల్లో గెలిచిన తర్వాత ఒలింపిక్స్-2028లో ఆడటమే తన లక్ష్యమని ఇప్పటికే సూర్య క్లియర్ గా చెప్పేశాడు. కెప్టెన్సీ వ్యవహారంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇండియన్ టీమ్ టీ20 కెప్టెన్ గా ఎవరూ ఊహించని పేరును ప్రతిపాదించాడు. జట్టులో చోటే లేని ప్లేయర్ కి జట్టు టీమ్ పగ్గాలు ఇవ్వాలని చెప్పడం గమనార్హం.
 
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కి టైటిల్ అందించిన కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. గతేడాది పంజాబ్ కింగ్స్ కి వెళ్లిన ఈ ముంబై బ్యాటర్.. ఆ జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. సారథిగా, బ్యాటర్ గా రాణించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయినప్పటికీ శ్రేయస్ ని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు.. అతడు ఫామ్ లో ఉన్నప్పటికీ.. టీమ్ లో మాత్రం చోటు ఇవ్వలేకపోతున్నామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తేల్చి చెప్పారు. ఆసియా టీ20 కప్- టోర్నీకి జట్టుని ప్రకటించిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. ఇక టీ20 వరల్డ్ కప్ -2026 జట్టులోనూ అయ్యర్ కి స్థానం లభించలేదు. 

►ALSO READ | Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్‌లోకి జడ్డూ.. మాజీ CSK ప్లేయర్ ఎంట్రీతో జోష్లో ఆర్ఆర్ టీమ్

దేశీయ లీగ్స్, ఐపీఎల్లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఆకాశ్ చోప్రా మాత్రం అయ్యర్ భారత జట్టు టీ20 కెప్టెన్ ఎందుకు కాకూడదంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ సారథిగా, బ్యాటర్ గా రాణిస్తే అతడికి మరో ఛాన్స్ దక్కుతుందని అన్నారు. శ్రేయస్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉంటాడని నేను అనుకున్నాను.. మిడిలార్డర్ లో ఒకవేళ చోటు ఖాళీ అయితే కచ్చితంగా అది అతడికే దక్కేది అన్నారు. కాబట్టి త్వరలోనే శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుందన్నారు.ఇక కెప్టెన్సీ విషయానికొస్తే.. ఇండియన్ టీమ్ తదుపరి కెప్టెన్ గా శ్రేయస్ ఎందుకు ఉండకూడదు? అందుకు అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.