శ్రీయపై ట్రోలింగ్ : పబ్లిక్‌గా లిప్ లాక్

శ్రీయపై ట్రోలింగ్ : పబ్లిక్‌గా లిప్ లాక్

హీరోయిన్ శ్రీయ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత భర్తతో కలిసి తెగ షికార్లు కొడుతోంది. ఇంతటితో ఆగని శ్రీయ.. పబ్లిక్ లోనే తన భర్తకు లిప్ లాక్ ఇచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. దీపావళి వేడుక కోసం భర్తతో కలిసి ముంబైకి వెళ్లిన ఆమె.. నిర్మాత రమేష్ తౌరానీ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్బంగా అందరు కలిసి ఘనంగా పార్టీ చేసుకున్నారు. తర్వాత ఫోటోలకు పోజులిచ్చిన శ్రీయ, భర్తను ముద్దుల వర్షంలో ముంచెత్తింది.

పబ్లిక్‌గా.. అందరూ చూస్తుండగానే లిఫ్ట్‌ ఎక్కడానికి వెళుతూ భర్తకు లిప్‌లాక్ ఇచ్చి షాకిచ్చింది శ్రీయ. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ముద్దుల ఫోటోలు కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పబ్లిక్‌గా ఇలా ముద్దులు పెట్టుకోవడమేంటని శ్రీయపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఇండియాలో పబ్లిక్ గా ఇలాంటి వేశాలు వేస్తావా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

లేటు వయసులో పెళ్లి చేసుకున్న శ్రీయ..భర్తతో ప్రతీక్షణం ఎంజాయ్ చేస్తున్నట్లు ఇటీవలే తెలిపింది. ఇటీవలే వీరిద్దరు బీచ్ లో దిగన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న శ్రీయ..సినిమాల ఆఫర్ల కోసమేనేమే అంటున్నారు నెటిజన్లు. 10 సంవత్సరాలు సౌత్ లో ఓ ఊపు ఊపిన శ్రీయ.. ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.