సౌత్ టాప్ హీరోయిన్, కమల్ హాసన్ డాటర్ శ్రుతి హాసన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేటెస్ట్గా హీరోయిన్ శ్రుతిహాసన్ చెన్నైలోని తన కొత్త ఇంట్లోకి సాంప్రదాయ పద్ధతిలో గృహ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజ కార్యక్రమాల్లో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న శ్రుతి.. కొత్త ఇంటి తాళాలు, ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. ఈ వేడుకలో ఆమెకు అత్యంత సన్నిహితులైన కొంతమంది మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఈ వేడుకకు శ్రుతి హాసన్ తండ్రి, నటుడు కమల్ హాసన్, సోదరి అక్షర హాసన్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
శ్రుతి గత కొన్నేళ్లుగా చెన్నై, ముంబైలో తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. అంతేకాకుండా శ్రుతికి ముంబైలో కూడా ఓ ఇల్లు ఉంది. ఇప్పుడు తన సొంత టౌన్ అయినా చెన్నైలో కూడా కొత్త ఇల్లు కొనుగోలు చేయడంతో శృతి లైఫ్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం అని అభిమానులు ట్వీట్స్ పెడుతున్నారు.
#ShrutiHaasan 's new home in Chennai 🏡💜🧿#HouseWarming pic.twitter.com/b4v3jPLpRo
— Rashmitha.PkSh (@itsmerashmitha) July 13, 2026
వెస్ట్రన్ స్టైల్‌కు భిన్నంగా శ్రుతి చెన్నై ఇల్లు..
వెస్ట్రన్ స్టైల్‌కు భిన్నంగా శ్రుతి చెన్నై ఇంటి గృహ ప్రవేశాన్ని పూర్తి సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం అభిమానులను ఆకట్టుకుంది. పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ముంబై ఇంటికి భిన్నంగా చెన్నై హోమ్ రెడీ అవ్వబోతున్నట్లుగా సమాచారం. శ్రుతి హాసన్ ముంబై ఇల్లు గోతిక్, రస్టిక్ థీమ్‌తో ప్రత్యేకంగా ఉంటుంది. అయితే చెన్నైలోని కొత్త ఇంటిని ఎలా డిజైన్ చేయబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
శ్రుతి హాసన్ గృహ ప్రవేశ ఫొటోలు వైరల్ అవుతున్నప్పటికీ, వాటిలో కమల్ హాసన్ లేకపోవడంపై అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే శ్రుతి హాసన్ తండ్రి కమల్ హాసన్, సోదరి అక్షర హాసన్ ఎందుకు రాలేదనే విషయం స్పష్టంగా తెలియలేదు. అయితే, కమల్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉండి రాలేకపోయినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రుతి హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శృతి చివరిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ' కూలీ' (2025) చిత్రంలో కనిపించింది. ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేసి అలరించింది. ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’, ‘ట్రైన్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Hello Hello..
— Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2026
Start dancing to the mass moves 💥💥 #Hellallallo full video song from #Peddi out now ❤🔥
▶️https://t.co/7dsDkWX2uh#PEDDI in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @shrutihaasan… pic.twitter.com/vWdK0FdEuv
