రాజకీయాల్లోకి స్టార్ హీరో డాటర్! క్లారిటీ ఇచ్చేసిందిగా

రాజకీయాల్లోకి స్టార్ హీరో డాటర్!  క్లారిటీ ఇచ్చేసిందిగా

కమల్​ హాసన్​ వారసురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చింది నటి శృతి హాసన్(Sruthihasan)​. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకోగా..ఇప్పుడు తండ్రి బాటలోనే పొలిటికల్​ ఎంట్రీ కూడా ఇవ్వనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. కమల్​హాసన్(Kamal Hasan)​ మక్కల్​ నీది మైయం(Makkal Needhi Maiam) (MNM) పేరుతో తమిళనాట రాజకీయ పార్టీ నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో శృతి కూడా ఈ పార్టీలో చేరి తండ్రి తరఫున ప్రచారం చేస్తుందనే రూమర్లు పుట్టుకొచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై శృతి హాసన్​స్పందించింది. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్​ ఏమాత్రం లేదని క్లారిటీ ఇచ్చింది. తన ప్రయారిటీ ఎప్పుడూ సినిమాలకేనని తేల్చి చెప్పింది. తను చేయబోయే సినిమాలు చిన్నవా..పెద్దవా అనే తేడా చూడకుండా కథకు, నటించే పాత్రకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తానని తెలిపింది. ఇకపోతే తాను తమిళ అమ్మాయి కాబట్టి..తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తానని..త్వరలో ఒక ఆల్బమ్ ని రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం శృతి హాసన్​ ప్రభాస్​తో సలార్​సినిమా షూటింగ్​లో బిజీగా ఉంది.  నాని హాయ్ నాన్న సినిమాలో క్యామియో రోల్ లో కనిపించనుంది . వీటితో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ‘ది ఐ’ అనే హాలీవుడ్​ సినిమాలోనూ నటిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా..మ్యూజిక్ డైరెక్టర్, సింగర్,రైటర్ గా ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్టర్స్ గా ప్రూవ్ చేసుకొంది.