శ్రుతి హాసన్ క్యామియో, ఐటమ్ సాంగ్కి అంత తీసుకుందా?

శ్రుతి హాసన్ క్యామియో, ఐటమ్ సాంగ్కి అంత తీసుకుందా?

టాలీవుడ్లో శృతి హాసన్ (Shruthi Hasan) వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ మొదటిలో ఆమెకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. పరాజయలకు క్రుంగి పోకుండా మరింత హార్డ్ వర్క్ చేసి తెలుగులో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. మధ్యలో ఖాళీ సమయం దొరికితే చాలు..ఇంస్టాగ్రామ్లో తనదైన స్టైల్లో ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఓ వైపు ఫ్యాన్స్ను.మరోవైపు నెటిజన్స్ను ఆకట్టుకుంటోంది.  

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..నాని(Nani)-మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా న‌టించిన హాయ్ నాన్న(HiNanna) సినిమాలో శృతిహాసన్ అతిధి పాత్రలో కనిపిస్తోన్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా నుంచి స్పెష‌ల్ సాంగ్ ఒడియమ్మా రిలీజ్ చేయగా..ఆడియాన్స్ ఊపేస్తోంది. ఈ ఐటమ్ సాంగ్లో శ్రుతి హాసన్ చేసిన డ్యాన్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో శృతి నటించిన కొన్ని సీన్స్కే ఏకంగా రూ.90 లక్షలు వసూలు చేసిందని ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే, శృతి కెరీర్ ఎలా దూసుకుపోతుందో ఇట్టే అర్ధం చేసుకోవొచ్చు.శౌర్యువ్ దర్శకత్వం వహిస్తోన్న హాయ్ నాన్న మూవీ 2023 డిసెంబర్ 7న విడుదల కానుంది.

రీసెంట్గా శృతి హాసన్ బాలయ్య బాబుతో వీరసింహా రెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య చిత్రాల తో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్(Salaar) లో నటిస్తున్న విషయం తెలిసిందే.