రంజీ ట్రోఫీ బరిలో శుభ్‌‌‌‌ మన్‌‌‌‌ గిల్‌‌‌‌

రంజీ ట్రోఫీ బరిలో శుభ్‌‌‌‌ మన్‌‌‌‌ గిల్‌‌‌‌

ముల్లన్‌‌‌‌పూర్‌‌‌‌: టీమిండియా టెస్ట్‌‌‌‌, వన్డే జట్టు కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌... రంజీ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. ఆదివారం నుంచి చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌తో జరిగే రెండో రౌండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో గిల్‌‌‌‌ పంజాబ్ జట్టుకు ఆడనున్నాడు. తొలి రౌండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు దూరంగా ఉన్న గిల్‌‌‌‌.. కివీస్‌‌‌‌ టూర్‌‌‌‌ నేపథ్యంలో బ్యాటింగ్‌‌‌‌ను సరి చూసుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. 

గిల్‌‌‌‌ రాకతో పంజాబ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ బలం కూడా డబుల్‌‌‌‌ అయ్యింది. గ్రూప్‌‌‌‌–బిలో కర్ణాటక.. సౌరాష్ట్రతో తలపడనుంది. స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ గోపాల్‌‌‌‌ కర్ణాటక జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. కివీస్‌‌‌‌ టూర్‌‌‌‌కు ఎంపికైన రవిచంద్రన్‌‌‌‌ స్మారణ్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌కు దూరమయ్యాడు. గాయాల నుంచి కోలుకున్న పేసర్లు విద్వత్‌‌‌‌ కావేరప్ప, వైశాక్‌‌‌‌ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ జట్టులోకి రావడం సానుకూలాంశం. మరోవైపు హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌తో తలపడనున్న ముంబైకి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆయుష్‌‌‌‌ మాత్రే, కివీస్‌‌‌‌ టూర్‌‌‌‌ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ముంబైకి అందుబాటులో లేరు. దాంతో సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ ఫామ్‌‌‌‌ అందుకోవాలని ముంబై ఆశిస్తోంది.