CSK vs GT: ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రసవత్తర పోరుకు తెరలేచింది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ తీసుకున్నాడు. పిచ్ పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గిల్ తెలిపాడు. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగనున్న చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరుపై కన్నేసింది. పిచ్ పొడిగా ఉందని, బోర్డుపై మంచి స్కోరు ఉంచి దానిని కాపాడుకుంటామని సీఎస్‌కే కెప్టెన్ గైక్వాడ్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ఉర్విల్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్ జట్టులోకి అర్షద్ ఖాన్ పునరాగమనం చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. పిచ్ కొంచెం డ్రైగా ఉంది.. మేము స్కోర్ బోర్డ్‌పై మంచి టోటల్ పెట్టి దాన్ని డిఫెండ్ చేయడంలో ఇబ్బంది లేదు.. జట్టులో మంచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది.. ప్రతి మ్యాచ్ కొత్తగా ప్రారంభమవుతుంది కాబట్టి పరిస్థితులను బట్టి ఆడాలి.. మేము క్రమంగా మెరుగవుతున్నాం.. కొన్ని విభాగాల్లో ఇంకా మెరుగుదల అవసరం ఉంది.. నేను మంచి ఆరంభాలు సాధిస్తున్నాను.. ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేశాం, ఉర్విల్ జట్టులోకి వచ్చాడని రుతురాజ్ వెల్లడించాడు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాం.. పిచ్ బాగానే కనిపిస్తోంది.. ఇలాంటి వికెట్‌పై ముందుగా స్కోర్ తెలుసుకోవడం ఉపయోగకరం.. మధ్యాహ్నపు వేడి పెద్దగా ప్రభావం చూపదని అనుకుంటున్నాం, ఎందుకంటే గాలి బాగా వీస్తోంది.. మా జట్టు చాలా విషయాల్లో మెరుగు పడింది, కానీ కీలక సమయాల్లో చిన్న తప్పిదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో 3–-4 ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇస్తున్నాం.. అందుకే క్రమంగా లెంగ్త్ బంతులు వేయడంపై దృష్టి పెట్టామని గిల్ చెప్పారు.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్.
చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జేమీ ఓవర్టన్, అఖీల్ హోస్సేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్,
🚨 Toss 🚨@gujarat_titans have won the toss and elected to bowl first against @ChennaiIPL in Chennai
— IndianPremierLeague (@IPL) April 26, 2026
Updates ▶️ https://t.co/zJBovAaCoM#TATAIPL | #KhelBindaas | #CSKvGT pic.twitter.com/AJsvDhnFY4
గుర్జాప్‌నీత్

