ఒరేయ్ గుండు నాయాల.. షాకింగ్ రిప్లై ఇచ్చిన దర్శకుడు

ఒరేయ్ గుండు నాయాల.. షాకింగ్ రిప్లై ఇచ్చిన దర్శకుడు

యూత్ స్టార్ సిద్దార్థ్(Siddarth) హీరోగా వచ్చిన ఓయ్(Oy) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. అవుట్ అండ్ అవుట్ లవ్ ఎమోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా 2009లో రిలీజై యావరేజ్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ, కమర్షియల్ గా ఎందుకు సక్సెస్ అవలేదు అనేది చాలా మందికి డౌటే. బేబీ షామిలి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా మంచి టీఆర్ఫీ వస్తుంది. అంతలా ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నాడు. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది. 

ఇక ఓయ్ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తయిన నేపధ్యంలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు మేకర్స్. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇస్తూ ఓయ్ రీ రిలీజ్ డేట్ ప్రకటించాడు చిత్ర దర్శకుడు ఆనంద్ రంగ. ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చిన ఓయ్ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఓయ్ సినిమా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

అందులో ఒక నెటిజన్ దర్శకుడు ఆనంద్ రంగ ను టాగ్ చేస్తూ.. ఒరేయ్ గుండు నాయాల.. ఇంత మంచి సినిమా తీసి ఎక్కడ పోయావ్.. అని కామెంట్ చేశాడు. అది చూసిన దర్శకుడు ఆనంద్ రంగ స్మైలీ ఎమోజీని యాడ్ చేసు రిప్లై ఇచ్చాడు. అది గమనించిన సదరు నెటిజన్.. మిమ్మల్ని గుండు అనేందుకు సారీ సారూ.. అంటూ మెసేజ్ చేశాడు.. మెసేజ్ కి మల్లి స్పందించిన ఆనంద్.. పరవాలేదు.. మీరు చెప్పింది నిజమేగా.. అంటూ రిప్లై. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.