సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు, వర్షం .. జనగామ క్రాస్ రోడ్డులో విరిగిపడిన చెట్లు

సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు, వర్షం .. జనగామ క్రాస్ రోడ్డులో విరిగిపడిన చెట్లు

హుస్నాబాద్(అక్కన్నపేట), వెలుగు: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు అక్కన్నపేట మండలానికి వెళ్లే ప్రధాన రహదారిలో జనగామ క్రాస్ వద్ద చెట్లు విరిగి పడ్డాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు విరిగిపడిన చెట్లను తొలగించారు.