కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో సీతారామచంద్రస్వమి ఆలయం వద్ద ఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జమ్మి ఆకును తీసుకున్న తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను తీసుకెళ్లేందుకు గ్రామంలోని వివిధ వాడలకు చెందిన యువకులు తీసుకెళ్లేందుకు పోటీ పడతారు.
తమ వాడకు చెందిన వారే జమ్మి కొమ్మను దక్కించుకున్నారని గర్వంగా చెప్పుకుంటారు. అయితే, మూడేండ్ల కింద కొమ్మ కోసం జరిగిన గొడవల్లో పలువురికి గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు ఈసారి కూడా పునరావృతం కాకుండా పోలీసులు యువకులను చెదరగొట్టి పోలీసు వాహనంలో జమ్మిచెట్టును స్టేషన్కు తరలించారు. దీంతో వరుసగా మూడో ఏడాది జమ్మి చెట్టు పోలీసుల నిర్భంధంలోకి చేరడం స్థానికంగా ఆసక్తిగా మారింది.
