రాంగ్ ఫిలాసఫీలో ఇరుక్కున్న రాయ్‌‌

రాంగ్ ఫిలాసఫీలో ఇరుక్కున్న రాయ్‌‌

 దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా వి యశస్వీ రూపొందించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్‌‌’.  జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ఇంటెన్స్ పాయింట్‌‌తో ఈ సినిమా తీశారు. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.  దీపక్ మొదటి సినిమాకే అన్ని ఎమోషన్స్‌‌ని చూపించడం మామూలు విషయం కాదు.

తనతో పాటు టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. కార్యక్రమంలో పాల్గొన్న  రైటర్ కోన వెంకట్, దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమా సక్సెస్ అవ్వాలని కోరారు. దీపక్ సరోజ్ మాట్లాడుతూ ‘‘సిద్ధార్థ్ రాయ్’ ఇంటెలిజెంట్, జీనియస్. కానీ  ఒక రాంగ్ ఫిలాసఫీలో ఇరుక్కుపోయి జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అనేది  కథ.  ఇలాంటి ఇంటెన్స్ పాత్రతో నన్ను నేను నిరూపించుకోవచ్చు. ప్రేక్షకులు  కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నాడు.  ఈ  సినిమాలో భాగమవడం ఆనందంగా ఉందని చెప్పింది హీరోయిన్ తన్వి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు దర్శక నిర్మాతలు. టీమ్ అంతా పాల్గొన్నారు.