సందేశాత్మకంగా సిద్ధార్థ్ రాయ్

సందేశాత్మకంగా సిద్ధార్థ్ రాయ్

దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా వి.యశస్వీ రూపొందిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్‌‌’. జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన  రచయిత యండమూరి వీరేంద్రనాథ్ , దర్శకులు సాయి రాజేష్, వీరశంకర్, లక్ష్మీ భూపాల సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు. హీరో చైల్డ్ లైఫ్ నుంచి 20ఏళ్ల మధ్య చూపే స్లైస్ ఆఫ్ లైఫ్ స్టోరీగా ట్రైలర్‌‌‌‌ను చూపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. 

ఈ సందర్భంగా దీపక్ మాట్లాడుతూ ‘టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌‌‌‌పై కూడా అదే ప్రేమ చూపిస్తారని నమ్మకం ఉంది. ఇందులో నా క్యారెక్టర్‌‌‌‌ను అద్భుతంగా డిజైన్ చేసిన యశస్వీకి థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని చెప్పింది తన్వి నేగి. యశస్వీ మాట్లాడుతూ ‘దీపక్ బెస్ట్ డెబ్యూ పెర్ఫార్మెన్స్‌‌గా ఈ చిత్రం నిలిచిపోతుంది. తన్వి, కీర్తన చాలా బాగా నటించారు. ‘అర్జున్‌‌ రెడ్డి’ జానర్‌‌‌‌లో ఉంటూనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రమిది. 

సుకుమార్ గారికి  సినిమా చూపించా.  ఫస్ట్ హాఫ్ అవ్వగానే లేచి హగ్ చేసుకున్నారు. అలాగే ఆయన బ్యానర్‌‌‌‌లో నా నెక్స్ట్‌‌ సినిమాకు అవకాశం ఇవ్వడం ఆల్రెడీ విజయం సాధించిన ఎక్స్‌‌పీరియెన్స్‌‌లో ఉన్నా. ఈ సినిమాతో ప్రేక్షకులు కచ్చితంగా బ్లాస్ట్ చూడబోతున్నారు’ అని చెప్పాడు. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.