ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి : సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి

ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను  యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి : సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి

సిద్దిపేట టౌన్, వెలుగు: జిల్లాలో ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియను యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్‌‌‌‌లో నోడల్ ఆఫీసర్లు, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్లు, బీఎల్‌‌‌‌వోలతో కలెక్టర్ సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఒక్క ఓటు కూడా తప్పిపోకూడదన్నారు. బీఎల్వోలు, సూపర్వైజర్లు సక్రమంగా విధులు నిర్వహించకపోతే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున్‌‌‌‌ను ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్నారు. 

యంగ్ ఇండియా స్కూల్‌‌‌‌ను తరలించొద్దు 

కొండపాక, వెలుగు:  కొండపాక మండల కేంద్రంలో ఏర్పాటుచేయనున్న యంగ్ ఇండియా స్కూల్‌‌‌‌ను మరో మండలానికి తరలించొద్దంటూ అఖిలపక్ష లీడర్లు సోమవారం కలెక్టర్ హైమావతికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు కొండపాక జడ్పీ హైస్కూల్‌‌‌‌లో ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పంపిణీ చేశారు.