సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్.. అక్రమ నిర్మాణాలు, రికార్డుల అవకతవకలపై చర్యలు

సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్.. అక్రమ నిర్మాణాలు, రికార్డుల అవకతవకలపై చర్యలు

సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న జె.రవికుమార్​ను కలెక్టర్​ కె.హైమావతి సస్పెండ్​ చేశారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలకు సహకరించడం, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం, లేని ఇంటికి నెంబర్లు కేటాయించి పన్ను రసీదులు జారీ చేసి డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు ఆయనపై వచ్చాయి. 

అలాగే, నకిలీ పత్రాలతో ఇండ్లు నిర్మించే వారికి నో డ్యూస్​ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై ఎంపీడీవో ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అనంతరం కలెక్టర్​ సస్పెన్షన్​ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్​ 15న ఉత్తర్వులు వెలువడగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.