సందేశాత్మకంగా సిద్ధుగాడి లవ్‌‌‌‌ స్టోరీ

సందేశాత్మకంగా సిద్ధుగాడి లవ్‌‌‌‌ స్టోరీ

మనోజ్ కుమార్ ,  మోహన సిద్ధి,  శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా, రమేష్ చెరుకూరు దర్శకత్వంలో  సి సావిత్రమ్మ  నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధుగాడి లవ్‌‌‌‌స్టోరీ’.  మంగళవారం ఈ మూవీ టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌కు దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్,  వి.ఎన్. ఆదిత్య,  వి. సముద్ర, నిర్మాతలు దామోదర ప్రసాద్, అశోక్ కుమార్,  ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరై టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. 

తమకు సపోర్ట్‌‌‌‌గా నిలిచి  ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ హీరో హీరోయిన్స్ థ్యాంక్స్ చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథతో పాటు మంచి సందేశాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం అని   దర్శకుడు రమేష్ చెరుకూరు చెప్పాడు. త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాతలు అన్నారు.