జ్యోతిష్యం :వృషభరాశిలో అమావాస్య ఎప్పుడు..సమస్యల పరిష్కారానికి ఆరోజు ఇలా చేయండి..

జ్యోతిష్యం :వృషభరాశిలో అమావాస్య ఎప్పుడు..సమస్యల పరిష్కారానికి ఆరోజు ఇలా చేయండి..

తెలుగు పంచాగం ప్రకారం  ప్రస్తుతం అధిక జ్యేష్ఠ మాసం కొనసాగుతుంది.  వేద క్యాలండర్​ ప్రకారం ఈ ఏడాది (2026, జూన్ 14న అధిక జ్యేష్ఠ  అమావాస్య  వృషభరాశిలో రాబోతోంది.ఆ రోజు ఒక కొత్త చంద్ర చక్రం ప్రారంభాన్ని సూచిస్తుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.  ఆ రోజున కొన్ని పరిహారాలు చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు. 

సాధారణంగా తెలుగురాష్ట్రాల్లో అమావాస్య రోజు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు.  కాని వృషభరాశిలో అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు ఎలాంటి పనిని ప్రారంభించినా ఆటంకం లేకుండా కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు.  అంతేకాదు అధికమాసం.. వృషభరాశిలో అమావాస్యకు చాలా విశిష్టత ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

వృషభ రాశిలో అమావాస్య తేదీ మరియు సమయం 

  • తేదీ:  2026 జూన్ 13
  • సమయం: శనివారం ఉదయం 09:24 గంటలకు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభరాశికి శుక్రుడు అధిపతి.  చంద్రుడు ఈ రాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. ఆ తరువాత మరో గ్రహంతో కలిసి సంచారం చేయడం చాలా శుభసూచికమని పండితులు చెబుతున్నారు.  ఆర్థిక స్థిరత్వం  లేక ఇబ్బంది పడేవారు.. అభివృద్ది కుంటుపడుతున్నవారు.. కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడేవారు.. భగవంతుని ఆశీస్సులతో అన్నీ రకాల సమస్యలనుంచి విముక్తి కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. వృషభ రాశిలో అమావాస్య ఘడియలు  ఒక కొత్త చంద్ర చక్రం ప్రారంభాన్ని సూచిస్తుంది

ఏం చేయాలంటే..

 చంద్రుడు వచ్చే సంధ్యా సమయంలో శుచిగా స్నానం చేసి దేవుడి మందిరం దగ్గర.. తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి.. వెన్నెల వెలుగులో ముందుగా సంకల్పం చెప్పుకొని ధ్యానం చేయాలి.  మీకు ఎలాంటి ఇబ్బంది.. సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి విముక్తి కలిగించమని చంద్రుని ఎదురుగా 11 సార్లు నీళ్లను వదలాలి.  ఆతరువాత అలానే చంద్రుని ఎదుట పాలతో అర్ఘ్యం వదలాలి. 

ఆ తరువాత మీకు నెరవేరాలనుకొనే కోరికల ను చంద్రునిచూస్తే రెండు చేతులతో నమస్కరిస్తూ చెప్పాలి. ఆ తరువాత  ఒక పెన్ను, కాగితం తీసుకుని, మీ కోరికలన్నింటినీ ఎర్ర ఇంకుతో కాగితంపై రాయాలి. అలా పక్షం రోజులు అంటే 15 రోజులు చేయాలి.  ఆతరువాత ఈ కాగితాలను చంద్రుని ఎదురుగా ఒక పాత్ర ఉంచి అందులో వేసి పసుపు.. కుంకుమ..గంధం వేసి రోజూ అగర్​బత్తీలు హారతి ఇవ్వాలి.  15 రోజులు ఈ కాగితాలన్నింటిని  రావి చెట్టు మొదట్లో ఉంచాలి. ఇలా చేస్తే మీ కోరికలు తీరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృషభరాశిలో అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు  సాయం సమయంలో చంద్రుడి దర్శనం తరువాత . మీరు గడ్డిపై చెప్పులు లేకుండా నడవాలి.  ఇలా నడవడం వలన చంద్రుని అనుగ్రహంలో మానసికంగా బలపడతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృషభ రాశిలో చంద్రుడు ప్రవేశం .. అమావాస్య రోజు చాలా అద్భుతమైన సమయమని పండితులు చెబుతున్నారు.  ఆరోజు గులాబీ నీటిలో పాలు, సుగంధ తైలాలను కలుపుకొని  స్నానం చేయాలి. ఇలా చేయడం వలన ఆకర్షణ శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతే కాదు వ్యాపారస్తులు ఈ  నీటిని షాపులో చల్లితే బిజినెస్​ డెవలప్​ జరుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఇక ఉద్యోగస్తులు వారి వర్క్​ ప్రదేశంలో ఈ నీటిలో చల్లితే ఉద్యోగంలో ఉన్న కష్టాలు తొలగుతాయని జ్యోతిష్యశాస్త్రంద్వారా తెలుస్తుంది. ఆ రోజున విష్ణు సహస్రనామ పఠనం, భగవద్గీత పారాయణం అత్యంత శుభప్రదమని చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.