ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇచ్చిన సిలై

ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇచ్చిన సిలై

హైదరాబాద్, వెలుగు:  శిల్పాలను తయారు చేసి, వాటిని ఇంటి లేదా కార్యాలయాలకు అనుగుణంగా తీర్చిదిద్దే  కంపెనీ సిలై, తమ సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన నలుగురు ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందించి సత్కరించింది. సంస్థ ప్రారంభం నుంచి నిరంతరం శ్రమిస్తున్న రాహుల్ కిషన్, మిథున్ మోహన్, నిశాంత్, సత్య నారాయణన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఈ కార్లను అందజేశారు.

వారి కుటుంబసభ్యులను సైతం వేడుకకు ఆహ్వానించి, వారికి నచ్చిన కార్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. సంస్థ ఎదుగుదలలో భాగమైన ఉద్యోగులు కూడా తమ కుటుంబాలతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిలై సీఈఓ అరుణ్ టైటన్ తెలిపారు. 2019లో ప్రారంభమైన సిలై.. హైదరాబాద్ (బంజారాహిల్స్), చెన్నై, కోయంబత్తూరులలో షోరూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహిస్తోంది.