SIM Binding Rules: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు, ముఖ్యంగా వాట్సాప్ (WhatsApp), టెలిగ్రామ్ (Telegram) యాప్‌లను ఎక్కువగా వాడే వారికి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ (DoT) సిమ్ బైండింగ్ (SIM Binding) నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈ కొత్త రూల్స్, మీ ఫోన్‌లో ఉన్న యాప్‌లు సజావుగా పని చేయాలంటే.. కేవైసీ (KYC) ద్వారా ధ్రువీకరించిన, ఆ యాప్ ఖాతాతో రిజిస్టర్ అయిన సిమ్ కార్డు తప్పనిసరిగా అదే మొబైల్‌లో అందుబాటులో ఉండాల్సిదేనని తేల్చి చెప్పింది.
ఏమిటీ సిమ్ బైండింగ్ అంటే ఏమిటీ:
* కమ్యూనికేషన్ యాప్‌ల ద్వారా జరుగుతున్న డిజిటల్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్‌లను అరికట్టడమే ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం.
* ఈKYC తప్పనిసరి: DoT ఆదేశాల ప్రకారం మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ వినియోగదారుల ఖాతాలకు సంబంధిత కేవైసీ (KYC) సిమ్ కార్డులతో కచ్చితంగా విలీనం/ధ్రువీకరించాల్సి ఉంటుంది.
* డెడ్‌లైన్: ఈ నిబంధనల పూర్తిస్థాయి అమలుకు కేంద్ర ప్రభుత్వం 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు విధించింది.
ఏ ఫోన్లు, ఎవరిపై ఎఫెక్ట్ పడనుంది:
* కేవలం వైఫై (Wi-Fi) ఆధారంగా సిమ్ కార్డు లేకుండా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వాడుతున్న వారికి రాబోయే రోజుల్లో యాక్సెస్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* సిమ్ లేని ఫోన్లు: మొబైల్‌లో రిజిస్టర్డ్ సిమ్ కార్డు లేకుండా కేవలం వైఫై సాయంతో యాప్‌లను ఉపయోగించే ఆండ్రాయిడ్ (Android), ఆపిల్ (iPhone) వినియోగదారులపై దీని ఎక్కువగా ఉంటుంది.
* ఆపిల్ ఐఓఎస్ (iOS) మార్పులు: సిమ్ బైండింగ్ నిబంధనలకు మద్దతుగా ఆపిల్ తన ఐఓఎస్ సిస్టమ్‌లో అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులను చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది.
* ఎవరికి సమస్య: విదేశాలకు ప్రయాణించేవారు, ఒకే ఖాతాను పలు పరికరాల్లో (Secondary devices) ఉపయోగించేవారు, కేవలం వైఫై ఆధారంగా సెకండరీ ఫోన్లను ఉపయోగించేవారు తమ యాప్ సెటప్‌ను పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
6 గంటల ఆటో లాగావుట్ రూల్‌పై క్లారిటీ:
* గతంలో 2025 నవంబర్ 28వ తేదీన టెలికాం శాఖ ఇచ్చిన ఆదేశాల్లో ప్రతి 6 గంటలకు ఒకసారి వాట్సాప్ వెబ్ (WhatsApp Web) సెషన్ల నుంచి ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్ అవ్వాలనే రూల్ ఉండేది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ తప్పనిసరి 6 గంటల ఆటో-లాగ్‌అవుట్ నిబంధనను ఉపసంహరించుకుంది.
* రిస్క్-బేస్డ్ లాగ్‌అవుట్: దీని స్థానంలో సైబర్ ముప్పు లేదా అనుమానాస్పద లాగిన్లు కనిపించినప్పుడు మాత్రమే సిస్టమ్ ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్ చేసే రిస్క్-బేస్డ్ విధానాన్ని తీసుకొచ్చింది.
అన్ని యాప్‌లకూ ఈ రూల్స్ వర్తిస్తాయా:
* వర్తించేవి: వాట్సాప్, టెలిగ్రామ్‌లు మాత్రమే ఈ సిమ్ బైండింగ్ పరిధిలోకి వస్తాయి.
* మినహాయింపులు: స్నాప్‌చాట్ (Snapchat) కు ఈ రూల్స్ నుంచి మినహాయింపు లభించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. మరొక ప్రముఖ యాప్ సిగ్నల్ (Signal) ఇంకా ప్రభుత్వ నోటీసులకు ఇప్పటి వరకు స్పందించలేదు.
* సమాచార భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఈ మార్పులపై మెసేజింగ్ వేదికలు అధికారికంగా తమ విధానాలను ప్రకటించే వరకు వినియోగదారులు వేచి చూడాల్సిందే.
