అబ్బాయిలు.. అలాంటిదేమీ లేదు.. ఇది మీకోసమే

అబ్బాయిలు.. అలాంటిదేమీ లేదు.. ఇది మీకోసమే

మృణాల్ ఠాకూర్(Mrunal thakur) పెళ్లి.. గత నెలరోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. నిర్మాత అల్లు అరవింద్ ఏ టైంలో ఆమె పెళ్లి గురించి స్టేజీపై మాట్లాడారో కానీ.. అప్పటినుండి ఆ వార్త వైరల్ అవుతూనే ఉంది. ఎంతలా అంటే..  ఈ విషయంపై డైరెక్ట్ గా మృణాల్ స్పదించినా కూడా వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఇక తాజాగా మరోసారి మృణాల్ పెళ్లి విషయం వచ్చింది వచ్చింది. ఈసారి వరుడు ఎవరో తెలుసా? బాలీవుడ్ ప్రముఖ సీజర్ బాడ్ షా. ఇటీవల మృణాల్ ముంబైలో జరిగిన దివాళి బ్యాష్ కు హాజరయ్యారు. అక్కడ ఈ బ్యూటీ సింగర్ బాడ్ షాతో సన్నిహితంగా కనిపించారు. దీనికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రెండు రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై స్పందించారు సింగర్ బాడ్ షా.. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. మీరు అనుకుంటున్నట్లు ఏమీలేదు.. అంటూ తన ఇన్‌స్టా పోటీ పెట్టారు. దీంతో ఈ ఇద్దరి పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది.

ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క రౌడీ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు పరశురామ్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా నటిస్తున్నారు మృణాల్. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి రానుంది. సీతారామంతో టాలీవుడ్ లోకి సూపర్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి.. రానున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.