Chinmayi : ఆ 'మోలెస్టర్'కు రెడ్ కార్పెట్టా? సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్‌లపై చిన్మయి ఫైర్

Chinmayi : ఆ 'మోలెస్టర్'కు రెడ్ కార్పెట్టా?  సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్‌లపై చిన్మయి ఫైర్

ఫైర్‌బ్రాండ్ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎప్పుడూ మహిళల హక్కుల కోసం, 'మీటూ' (#MeToo) బాధితుల తరపున గళమెత్తే చిన్మయి.. ఈసారి ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత , తమిళనాడు సీఎం విజయ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్‌లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు... తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ ర్యాపర్ వేదన్ (Vedan) ను రాజకీయ పార్టీలు నెత్తిన పెట్టుకోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగింది?

ఇటీవల తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యే రాజ్‌మోహన్, మలయాళ ర్యాపర్ వేదన్‌ను కలిసి గౌరవించారు. దీనికి సంబంధించిన విజువల్స్ బయటకు రావడంతో చిన్మయి ఘాటుగా స్పందించారు. గతంలో కోవిడ్ సమయంలోనే వేదన్‌పై పలువురు మహిళలు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని, అలాంటి వ్యక్తిని కొత్త రాజకీయ పార్టీలు, నాయకులు చేరదీసి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

వాడితో పనిచేయను..

ఈ వివాదంపై చిన్మయి తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. కోవిడ్ సమయంలో గోవింద్ వసంత, ముహసిన్ పరారి, వేదన్,  నేను కలిసి ఒక సాంగ్ చేయాల్సింది. కానీ ఒక క్లబ్‌హౌస్ సెషన్‌లో ఓ మహిళ వేదన్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెబితే షాకయ్యాను. వెంటనే ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాను. ఆ తర్వాత వేదన్ పాల్గొన్న ఏ కాన్సెర్ట్‌లోనూ నేను పాడలేదు. దీనివల్ల నాకు ఎన్నో అవకాశాలు, డబ్బు పోయినా సరే.. నా నైతికతను కోల్పోలేదు అంటూ చిన్మయి సంచలన విషయాలు పంచుకున్నారు.

 

ఉదయనిధి స్టాలిన్‌పై అటాక్!

కేవలం విజయ్ పార్టీ మాత్రమే కాదు.. డిఎంకె (DMK) నేత ఉదయనిధి స్టాలిన్ కూడా వేదన్‌తో ఉన్న ఒక వీడియోను చిన్మయి షేర్ చేస్తూ.. ఒక  లైంగిక వేధింపుల నిందితుడి ( మోలెస్టర్) కి ఇరుపక్షాలూ రెడ్ కార్పెట్ పరుస్తుంటే, ఇక వాళ్లను వేదికలు ఇవ్వద్దని బ్రతిమాలడం నేను మానేశాను అంటూ విమర్శించారు. సామాజిక చైతన్యం, కుల వివక్షపై పాటలు పాడుతూ బయట హీరో లా చలామణి అయ్యే కొందరు పురుషులు.. తెరవెనుక మహిళలను గౌరవించని మృగాలుగా మారుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ప్రస్తుతం వేదన్ చిరుత పులి పన్ను అక్రమంగా కలిగి ఉన్నాడనే కొత్త కేసులో కూడా ఇరుక్కున్నాడు.

►ALSO READ | VenkyAnil5: ఎలా అండి ఇలా.. జివి & అనంత్ను ఇసుకలో పాతేసిన అనిల్.. వీడియో వైరల్

గతంలో ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తుపై 18 మంది మహిళలు ఆరోపణలు చేసినప్పుడు కూడా డిఎంకె ప్రభుత్వం ఆయనకు సపోర్ట్ చేసిందని చిన్మయి గుర్తుచేశారు. పొలిటికల్ లీడర్స్ ఓట్ల కోసం ఇలాంటి క్రిమినల్స్ వెనుక తిరగడం ఆపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ ట్వీట్లు సినీ ఇండస్ట్రీతో పాటు తమిళ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మరి ఇది ఎంత వరకు దారితీస్తుందో చూడాలి.