Harika Narayan: పెళ్లిచేసుకున్న సింగర్ హారిక నారాయణ్.. వరుడు ఎవరో తెలుసా?

Harika Narayan: పెళ్లిచేసుకున్న సింగర్ హారిక నారాయణ్.. వరుడు ఎవరో తెలుసా?

ప్రముఖ గాయని హారిక నారాయణ్(Harika Narayan) పెళ్లిచేసుకున్నారు. తన స్నేహితుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి పృథ్వీనాథ్(Prithvinath) తో కలిసి ఏడడుగులు వేశారు. గత ఏడూ సంవత్సరాలు ప్రేమలో ఉన్న వీరి వివాహం మార్చ్ 17న అంగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబందించిన ప్రముఖ సింగర్స్ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం హారిక, పృథ్వీనాథ్ కి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 

 

 

 

ఇక గాయని హారిక నారాయణ్ విషయానికి వస్తే.. చాలా కాలంగా తెలుగులో పాటలు పడుతున్నా ఈ మధ్యే ఆమెకు పాపులారిటీ వచ్చింది. రీసెంట్ గా ఆమె పాడిన వారసుడు సినిమాలోని తలపతి అనే పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ తలపతి ఫ్యాన్స్ ఈ పాటకు ఉర్రూతలుగుపోయారు. ఇక ఆచార్య సినిమాలో లాహే.. లాహే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ పాటకు గాను ఇటీవలే బెస్ట్ సింగర్ గా గామా అవార్డు అందుకున్నారు హారిక నారాయణ్.