శభాష్ సజ్జనార్ సర్.. కిన్నెర మొగులయ్య ప్రశంస

శభాష్ సజ్జనార్ సర్.. కిన్నెర మొగులయ్య ప్రశంస

కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య  భీమ్లా నాయక్ లో తన గానం వినిపించి ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాడు. ఆడా...గాదు..ఈడా...గాదు.. అంటు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో ఫేమస్ అయిన మొగులయ్య లేటెస్ట్ గా తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రశంసించాడు.తన కూతురి పెళ్లికి ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్నామంటూ ఆర్టీసీ సేవలను కిన్నెరతో పాట రూపంలో చెప్పాడు. బుక్ చేసిన గంటలోనే బస్సు వచ్చిందని..బస్సులో ప్రయాణం సంతోషాన్నించిందన్నారు. అది బస్సు కాదు..తల్లిలాంటిదని..శభాష్ సజ్జనార్ సర్.. అంటూ ప్రశంసించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇపుడు తెగ వైరల్ అవుతోంది.