కండోమ్ ప్యాకెట్లతో సర్కారు నౌకరి ట్రైలర్..సందేశం ఇచ్చేలా సింగర్ సునీత కొడుకు సినిమా

కండోమ్ ప్యాకెట్లతో సర్కారు నౌకరి ట్రైలర్..సందేశం ఇచ్చేలా సింగర్ సునీత కొడుకు సినిమా

సింగర్ సునీత(Sunitha) కొడుకు ఆకాష్ (Akash)​ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నమూవీ.. సర్కారు నౌకరి (SarkaruNaukari).  దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు(KRaghavendraRao) ప్రొడ్యూసర్ గా గంగనమోని శేఖర్(ShekarGanganamoni)  డైరెక్షన్ చేస్తున్నారు. భావనా వళపండల్ హీరోయిన్‌‌గా పరిచయమవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ట్రైలర్ షురూ అవుతూనే..పల్లెటూరి అందాలతో..హీరోయిన్ అందమైన మాటలతో అట్ట్రాక్ట్ చేసేలా ఉంది. సర్కార్ నౌకరి చేసే అబ్బాయితో పెళ్లి కావాలని కలలు కన్న హీరోయిన్కు సర్కారోడి భార్య అయ్యాక దక్కే మర్యాదను చూపించారు డైరెక్టర్. ఊర్లో కొత్తగా వచ్చిన సర్కారు నౌకరు ఆయన పెళ్ళాం..ఏడికి బయటికి వెళ్లిన మస్త్ అనిపిస్తుంది. అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.ఈ మూవీలో  హీరో గవర్నమెంట్ మెడికల్ ఎంప్లాయిగా చూపించారు. 

ఇక అతడు ఊరు చివర బాక్స్లో కండోమ్ ప్యాకెట్లను పెట్టడం..ఆ కండోమ్ ప్యాకెట్లను ఊర్లోని చిన్నపిల్లలు బూరలులాగా ఊదుకుంటూ ఆడుకోవడం..ఊరంతా దాని గురించి చెప్పుకోవడం కూడా చూపించిన సీన్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది.చివరికి అతడు చేసే ఉద్యోగం వల్లనో, మరే ఇతర కారణం వల్లనో ఊళ్లోకి రావద్దంటూ వార్నింగ్ ఇస్తూ వచ్చే ఎమోషనల్ ఎలిమెంట్స్ ట్రైలర్ను కట్ చేసిన విధానం బాగుంది. ట్రైలర్ చివర్లో సర్కారు నౌకరు అంటే..సర్కారీ జీతం తీసుకోవడం కాదు సర్..ప్రజలకు సేవ చేయడం..అంటూ హీరో చెప్పే డైలగ్స్ ఎమోషనల్ గా ఉన్నాయి. 

ఈ మూవీని లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావుకు చెందిన ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, సూర్య, రాజేశ్వరి ముళ్లపూడి, తదితరులు ఇతర కీ రోల్ ప్లే చేశారు. శాండిల్య మ్యూజిక్ ఈ మూవీకు స్పెషల్  అసెట్ గా కనిపిస్తోంది. డైరెక్షన్,సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా గంగనమోని శేఖర్ తన క్రీయేటివిటీ ని ప్రూవ్ చేసుకోబోతున్నారు. ఇక సింగర్ సునీత కొడుకైన ఆకాష్..ఈ మూవీతో ఫ్యాన్స్ ను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.