‘సర్’ రద్దు చేయాలె..జ్ఞానేశ్ రిజైన్ చేయాలె..ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

‘సర్’ రద్దు చేయాలె..జ్ఞానేశ్ రిజైన్ చేయాలె..ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

సైఫాబాద్, వెలుగు : ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌‌‌‌ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ను తొలగించాలని హైదరాబాద్‌‌‌‌లోని లిబర్టీ నుంచి బీఆర్‌‌‌‌కే భవన్‌‌‌‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసు వరకు బుధవారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. 

బారికేడ్లను దాటి ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేర్లేకంటి శ్రీకాంత్ పాల్గొన్నారు. 

కదులుతున్న రైళ్లను ఆపగలరు.. మా ఉద్యమాన్ని కాదు !

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు : ‘కదులుతున్న రైళ్లను ఆపగలరేమో...కానీ, కదిలే మా ఉద్యమాన్ని కాదు’ అంటూ కాక్రోచ్​ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌‌‌‌లో నిరసన ర్యాలీ తీశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌‌‌ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

ఎల్బీ స్టేడియం నుంచి మొదలైన ర్యాలీ గన్‌‌‌‌పార్క్‌‌‌‌ వరకు సాగగా, వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్​ఎం. రంగసాయి రెడ్డి, పార్టీ మెంబర్​కె. రాజేష్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మమత పాల్గొన్నారు.