వెలుగు స్పెషల్ : సర్ పై అనుమానాలు, అసలు నిజాలు!.. దేశవ్యాప్తంగా రాజ్యాంగపరమైన చర్చ

వెలుగు స్పెషల్ : సర్ పై అనుమానాలు, అసలు నిజాలు!.. దేశవ్యాప్తంగా రాజ్యాంగపరమైన చర్చ

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రస్తుతం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్‌‌‌‌‌‌‌‌) దేశవ్యాప్తంగా తీవ్ర రాజ్యాంగపరమైన చర్చకూ, రాజకీయ వివాదానికీ దారితీసింది. అసలు ఈ కార్యక్రమం ఎందుకు వివాదాస్పదమైంది?  కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సింది పోయి, తీవ్ర అనుమానాలకు తావిచ్చేలా ఎందుకు అడుగులు వేసింది?  

కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు రగడ సృష్టిస్తున్నాయా... ఒకవేళ అదే నిజమైతే,  మాజీ  చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు,  విశ్రాంత  సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ రంగాల మేధావులు సైతం ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? వారి గళాన్ని కేవలం రాజకీయ  ప్రేరేపితమైనదిగా  కొట్టిపారేయగలమా?  లేక ఎన్నికల సంఘం తనదైన ఎజెండాలో భాగంగానే ఈ ‘సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ప్రక్రియను చేపట్టిందా? 

ఈ ప్రశ్నలన్నింటికీ రాజ్యాంగ వెలుగులో సమాధానం వెతికితే.. ఈ రగడకు  ప్రాథమికంగా ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరి, ఆచరణలోని తీవ్ర లోపాలే  మూలకారణమని స్పష్టమవుతోంది.  ఈసీ వ్యవహార శైలే నేడు ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నార్ధకం చేస్తోందనే చర్చకు తావిస్తోంది.

సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివాదం ప్రధానంగా రెండు అంశాల చుట్టూ తిరుగుతోంది.  మొదటిది.  ఫారం-6,  ఫారం-7ల  ప్రక్రియలో  చట్ట విరుద్ధమైన మార్పులు చేయడమైతే,  రెండోది.  ఆచరణలో  సామాన్య ఓటర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులు.  మన  రాజ్యాంగంలోని 324 నుంచి 329 వరకు ఉన్న అధికరణలు ఎన్నికల సంఘం బాధ్యతలను,  స్వతంత్రతను,  ఓటర్ల జాబితా తయారీ పరిధిని అత్యంత స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. 

 రాజ్యాంగ ఆదేశాల మేరకు 1950లో పార్లమెంట్ ఆమోదించిన 'ప్రజా ప్రాతినిధ్య చట్టం'  ఓటర్ల  అర్హతలు, జాబితా ప్రక్రియకు అత్యున్నత ప్రామాణికం.  దీనికి అనుబంధంగా రూపొందించిన 1960 ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ,  లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల ఓటర్ల నమోదు, తొలగింపు, బదిలీల కోసం ఫారం 6, 7, 8లను కేటాయించారు. 

ఫారం 6లో ఈసీ మార్పులు రాజ్యాంగ ధిక్కరణ

చట్ట ప్రకారం ఈ ఫారాలలో కానీ, డిక్లరేషన్లలో కానీ ఎలాంటి మార్పులు చేయాలన్నా కేంద్ర న్యాయశాఖ ద్వారా నిబంధనల నోటిఫికేషన్ రావాలి, దానికి పార్లమెంట్ ఆమోదం పొందాలి.  కానీ,  ప్రస్తుత 'ఎస్ఐఆర్‌‌‌‌‌‌‌‌'  ప్రక్రియలో ఈసీ చట్టపరమైన ప్రక్రియను పూర్తిగా దాటవేసి, ఫారం-6లో  నేరుగా సొంతంగా మార్పులు చేసి, తన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ద్వారా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో పొందుపరిచింది. ఇది తీవ్రమైన రాజ్యాంగ ధిక్కరణ. 

 ఇటీవల సుప్రీంకోర్టు  ‘ఫారం-6లో మార్పులకు మేం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు’  అని స్పష్టం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో,  ఆ  కొత్త  డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌ను ఈసీ రాత్రికి రాత్రే వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ నుంచి తొలగించాల్సి వచ్చింది.  దేశ  సర్వోన్నత  న్యాయస్థానం జోక్యం చేసుకునేంతవరకు  చట్టాలను,  రాజ్యాంగ పరిమితులను ఈసీ పట్టించుకోకపోవడం  స్వతంత్ర వ్యవస్థల  పనితీరుపై  కోలుకోలేని  దెబ్బకొట్టింది.  

చట్టపరమైన ఉల్లంఘనలు  ఒకవైపు ఉంటే,  క్షేత్రస్థాయిలో  పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్న నిబంధనలు మరో తీవ్రమైన సమస్య.  2002 ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని  గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఓటు వేస్తున్న పౌరులకు కూడా నోటీసులు జారీ చేయడం విడ్డూరం.  బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ప్రతి ఇంటికీ వెళ్లకుండా కేవలం ఫోన్ల ద్వారా సమన్లు పంపుతూ కార్యాలయాలకు రమ్మనడం ఓటర్లను తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది.

ఈసీ మౌనం.. రాజకీయ సమరం

 నకిలీ ఓటర్లను,  చనిపోయినవారి  ఓట్లను తొలగించడమే  లక్ష్యమైతే  ప్రతి ఇంటికీ వెళ్లి  ప్రత్యక్షంగా పరిశీలిస్తే సరిపోయేది.  కానీ, ఇరవై ఏళ్లుగా ఓటేస్తున్నవారిని మళ్లీ  ఫారం-6 ద్వారా  కొత్తగా  దరఖాస్తు  చేసుకోవాలని అనడం, దానికి ఆధారంగా అందరికీ అందుబాటులో ఉండే ఆధార్ కాకుండా పాస్‌‌‌‌‌‌‌‌పోర్ట్,  జనన  ధ్రువీకరణ పత్రం లేదా 10వ తరగతి  మెమో వంటి  సంక్లిష్టమైన పత్రాలను కోరడం  వేలాదిమంది ఓటర్లను హక్కు కోల్పోయే ప్రమాదంలోకి నెడుతోంది.   

విదేశీ చొరబాటుదారులను  ఏరివేసేందుకే ఈ నిబంధనలని చెబుతున్నప్పటికీ... దాని
పేరుతో  దేశ పౌరులందరినీ అనుమానిస్తూ..  ఓటర్ల జాబితా  సవరణను పౌరసత్వ నిర్ధారణ  పరీక్షగా మార్చడం రాజ్యాంగ స్ఫూర్తికే  విరుద్ధం.  

ఎన్నికల సంఘం అనేది ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై నడిచే సంస్థ కాదు.  అది  రాజ్యాంగం  ప్రసాదించిన స్వతంత్ర వ్యవస్థ.  విపక్షాలు, మేధావులు లేవనెత్తిన సందేహాలకు ఈసీ శాస్త్రీయంగా,  పారదర్శకంగా సమాధానం చెప్పి ఉంటే ఈ వివాదం రాజ్యాంగ సంక్షోభం వరకు వెళ్లేది కాదు. కానీ ఈసీ మౌనం దాల్చడం, అధికార పార్టీ నాయకులు ఈసీ నిర్ణయాలను సమర్థిస్తూ మాట్లాడటంతో సందేహాలు మరింత బలపడ్డాయి. ఈసీకి, ప్రతిపక్షాలకు మధ్య తేలాల్సిన అంశం .. అధికార వర్సెస్ విపక్షాల రాజకీయ సమరంగా మారిపోయింది. చివరకు విపక్షాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల చ‌‌‌‌‌‌‌‌ట్ట స‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణపై కూడా అనుమానాలు

ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాస్వామ్యవాదులు, చట్ట కోవిదులు ఈసీ ముందుంచుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. 2002 తరహాలోనే  ఇంటింటికీ తిరిగి  ప్రత్యక్ష సవరణలు చేయకుండా, పాత జాబితా ఆధారంగా మ్యాపింగ్ చేసి నోటీసులు ఇవ్వడం రాజ్యాంగబద్ధమేనా?   రాజ్యాంగం, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1960 నిబంధనలను పక్కనబెట్టి  ఫారం-6 డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌లో  మార్పులు ఏ అధికారంతో చేశారు?  న్యాయశాఖ నోటిఫికేషన్,  పార్లమెంట్ ఆమోదం లేకుండా  ఈసీ నేరుగా  మార్పులు చేయడానికి చట్టం అంగీకరిస్తుందా?  

ఫారం-6  మార్పులపై  దేశ అత్యున్నత  సుప్రీంకోర్టు ఆక్షేపణలు తెలిపేంతవరకు ఈసీ ఎందుకు వేచి చూసింది? కోర్టు ఉత్తర్వుల తర్వాతే ఆ మార్పులను ఎందుకు తొలగించింది?  దశాబ్దాలుగా  ఓటుహక్కు  వినియోగించుకుంటున్న స్వచ్ఛమైన భారతీయ  పౌరులను మళ్లీ కొత్త ఓటర్లుగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరడం వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటి?  దీంతోపాటు  2023లో  కేంద్ర ప్రభుత్వం  తీసుకువ‌‌‌‌‌‌‌‌చ్చిన ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల చ‌‌‌‌‌‌‌‌ట్ట స‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణపై కూడా పెద్ద ఎత్తున అనుమానాలు నెల‌‌‌‌‌‌‌‌కొన్నాయి. 

ఎన్నికల సంఘం క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్లు, ప్రధాన క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్ల నియామ‌‌‌‌‌‌‌‌కానికి  ప్రధానమంత్రి,  ప్రతిప‌‌‌‌‌‌‌‌క్ష నేత‌‌‌‌‌‌‌‌తోపాటు  సుప్రీంకోర్టు సీజేఐ ఉండాల‌‌‌‌‌‌‌‌న్న  నిబంధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ను  తీసివేసిన చ‌‌‌‌‌‌‌‌ర్య పెద్ద ఎత్తున ప్రస్తుత వివాదాల‌‌‌‌‌‌‌‌కు, అనుమానాల‌‌‌‌‌‌‌‌కు తావిస్తోంది. 

ప్రజాస్వామ్యానికి ఓటుహక్కు ఆత్మవంటిది

ఎన్నికల చట్ట సవరణలో సీజేఐ స్థానంలో  కేంద్ర  హోంశాఖ మంత్రిని పెట్టడమంటే  ప్రభుత్వానికి అనుకూల‌‌‌‌‌‌‌‌మైన ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల  క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  నియ‌‌‌‌‌‌‌‌మించుకోవ‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌మే అనే చ‌‌‌‌‌‌‌‌ర్చ బ‌‌‌‌‌‌‌‌హిరంగంగా న‌‌‌‌‌‌‌‌డుస్తోంది.  ఇలా కేంద్ర ప్రభుత్వ  అనుకూల ఈసీఐ ఉంటే,  ఆయ‌‌‌‌‌‌‌‌న ఒత్తిడి  నుంచే ఈ ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్  ప్రక్రియ పుట్టింద‌‌‌‌‌‌‌‌న్న వాద‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు నేడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుండ‌‌‌‌‌‌‌‌గా,  ఈసీ ఇందుకు  బ‌‌‌‌‌‌‌‌దులు ఇవ్వాల్సి ఉంది.  ప్రజాస్వామ్యానికి  ఓటు హక్కు  ఆత్మవంటిది.  దానిని  కాపాడాల్సిన  రాజ్యాంగ వ్యవస్థలే  అనుమానాస్పద  నిర్ణయాలతో  పౌరుల హక్కులను  సంక్షోభంలోకి నెట్టడం భావ్యం కాదు.  

ప్రజాస్వామ్యాన్ని  రక్షించాల్సిన ఈసీ ఏకపక్ష  ధోరణితో  వ్యవహరిస్తూ  సమాధానం చెప్పకుండా  మౌనం దాల్చడం  ‘తప్పు  చేసినోడు  తప్పుకున్నట్టు,  తలకాయ పడ్డోడు  మొత్తుకున్నట్టు’ తయారైంది.  ఇప్పటికైనా  ఎన్నికల సంఘం  తన  చట్టపరమైన లోపాలను సరిదిద్దుకుని,  ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ రాజ్యాంగబద్ధంగా,  నిష్పాక్షికంగా ముందుకెళ్లాల్సిన అత్యంత  ఆవశ్యకత ఉంది.




- పీవీ శ్రీనివాస‌‌‌‌‌‌‌‌రావు,ఆర్టీఐ క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌, సీనియ‌‌‌‌‌‌‌‌ర్ జ‌‌‌‌‌‌‌‌ర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.