City Lifestyle : కొత్త ట్రెండ్ సిస్టర్ ఇన్ స్వెట్.. ఇక్కడ మహిళలు ఏం చేస్తారు.. ఉపయోగం ఏంటీ..?

City Lifestyle : కొత్త ట్రెండ్ సిస్టర్ ఇన్ స్వెట్.. ఇక్కడ మహిళలు ఏం చేస్తారు.. ఉపయోగం ఏంటీ..?

వీకెండ్​ అంటే.. సినిమాకో, కిట్టీ పార్టీకో లేదంటే.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టూర్లకు, ఔటింగ్​కు వెళ్లడం కామన్. కానీ, సిటీ మహిళలు ఇప్పుడు వీకెండ్​లో స్పోర్ట్స్​ యాక్టివిటీస్​తో ఉత్సాహంగా గడుపుతున్నారు. స్పోర్ట్స్ ​మీద ఇంట్రస్ట్ ​చూపిస్తున్నారు కదా.. వీళ్లంతా ప్రొఫెషనల్స్​ అనుకుంటే పొరపాటే. ఆరోగ్యం కోసం రొటీన్​గా జిమ్, యోగా, మెడిటేషన్ ​క్లాసులకు వెళ్ల కుండా డిఫరెంట్​గా స్పోర్ట్స్​ యాక్టివిటీస్​లో పార్టిసిపేట్​ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఎప్పుడూ చేసే సాధారణ వ్యాయామానికి బదులు కోర్ ​స్ర్టెంత్​తో ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలంటూ బెంగళూరుకు చెందిన ‘సిస్టర్ ​ఇన్​ స్వెట్’ అనే సంస్థ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. దీంతో ఇప్పుడు సిటీలోని చాలామంది మహిళలు ఈ ప్లాట్​ఫామ్​ను ఉపయోగించు కుంటున్నారు. ‘సిస్టర్​ ఇన్ ​స్వెట్’ బెంగళూరు, ముంబై, చెన్నై​తో పాటు మన గ్రేటర్​ నగరంలో ట్రెండ్​ అవుతోంది. 

సిస్టర్ ​ఇన్ ​స్వెట్ ​సంస్థ 2017లో బెంగళూరు​లో తన ప్రస్థానం మొదలుపెట్టింది. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారిణి తాన్వీ హన్స్, ఫిట్‌నెస్ కోచ్ శ్వేతా సుబ్బయ్య కలిసి ఈ సంస్థను ప్రారంభించారు. మహిళల కోసం, మహిళలతో నడిచే ఈ సంస్థ  స్పోర్ట్స్, హెల్దీ ఈవెంట్లతో  బెస్ట్​ విమెన్​ కమ్యూనిటీని డెవలప్ ​చేస్తోంది. ఈ మధ్యే హైదరాబాద్‌లో కూడా ఆక్టివిటీస్​ మొదలుపెట్టింది. మిగతా రోజుల్లో వివిధ పనులతో బిజీగా ఉండే మహిళల ఆరోగ్యంపై ఫోకస్​ చేస్తూ వీకెండ్​లో వాళ్లను స్పోర్ట్స్​ యాక్టివిటీస్​లో భాగస్వాములను చేస్తోంది. జిమ్, యోగాలకు వెళ్లడం ఆసక్తి లేని, ఎనర్జిటిక్​ యాక్టివిటీస్ కోరుకునే మహిళల కోసం రకరకాల సెషన్లను అందుబాటులోకి తెచ్చింది. మన నగరంలో ప్రత్యేకంగా కోచ్​ల పర్యవేక్షణలో రన్నింగ్ క్లబ్, ఫుట్ బాల్, పికెల్​బాల్ ​ఆడిస్తోంది. వీటి ద్వారా మహిళలు శారీరకంగా దృఢంగా మారడమే కాకుండా, సోషలైజ్​అయ్యే అవకాశం పెరుగుతుందని చెప్తోంది. 

500 మంది వరకు..

నగరంలోని కొన్ని ప్లేసెస్‌ను అద్దెకు తీసుకుని స్పోర్ట్స్​ యాక్టివిటీస్​ నిర్వహిస్తోంది సిస్టర్​ ఇన్ ​స్వెట్. వీకెండ్​లో సెషన్ల వారీగా ఆటలు, ఫీజులు ఉంటాయి. రూ.300  నుంచి రూ.1000 వరకు ఫీజులు ఉండగా, యాన్యువల్ ​మల్టీ స్పోర్ట్​ ప్యాకేజీకి రూ. 13,500 వరకు తీసుకుంటున్నారు. వీక్లీ, మంత్లీ సెషన్లు కూడా నిర్వహిస్తున్నారు. రన్నింగ్​ను కేబీఆర్​ పార్కులో, పికెల్​బాల్​ను జూబ్లీహిల్స్​లో, ఫుట్ బాల్​ను జూబ్లీహిల్స్​లోని టర్ఫ్​సైడ్​లో నిర్వహిస్తుండగా.. సుమారు 500 మంది వరకు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సంస్థ వెబ్​సైట్​sisterinsweat.comలోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ​చేసుకోవచ్చు. తర్వాత మెన్షన్​ చేసిన టైంకు, చెప్పిన ప్లేస్​కు వెళ్లి మీట్​అవుతారు. అక్కడ కోచ్​ పర్యవేక్షణలో స్పోర్ట్స్​ ఆడతారు. ఇప్పుడు నగరంలో మూడు రకాల స్పోర్ట్స్​యాక్టివిటీస్ ​నిర్వహిస్తుండగా భవిష్యత్తులో స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, వాలీబాల్ ​వంటివి చేర్చి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు.  

త్వరలో 10కే రన్​...

బెంగళూరులో ఇక్కడున్న వాటితో పాటు అదనంగా స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, వాలీబాల్​ వంటి స్పోర్ట్స్​ యాక్టివిటీస్ ​అందుబాటులో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం అక్కడ 2వేల మంది మహిళలతో మారథాన్ ​నిర్వహించి సక్సెస్​ అయ్యారు. త్వరలో మన నగరంలోనూ మహిళల కోసం 10కె రన్ నిర్వహించేందుకు సిస్టర్​ ఇన్ ​స్వెట్ ​సిద్ధమవుతోంది. మహిళలకు  క్రీడల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడాన్ని కూడా ఈ సంస్థ  లక్ష్యంగా పెట్టుకున్నది.-వినోద్​ మామిడాల, హైదరాబాద్​ సిటీ 

సామాజిక సాధికారతకు వేదిక

సిస్టర్స్ ఇన్ స్వెట్ కేవలం ఆరోగ్యం మీద అవగాహన కల్పించే  సంస్థ మాత్రమే కాదు. మహిళల సామాజిక సాధికారతకు వేదిక కూడా. మా దగ్గర 20 ఏండ్ల  వయసు నుంచి 50 ఏండ్లు పైబడిన వాళ్ల వరకు సుమారు 500 మంది స్పోర్ట్స్​ఆడుతున్నారు. ఇందులో స్టూడెంట్స్, హౌస్​ వైఫ్స్, వర్కింగ్​ విమెన్, ఆంత్రప్రెన్యూర్స్, టీచర్స్​ ఇలా వివిధ రకాల బ్యాక్​గ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లు ఉన్నారు. వీళ్లంతా ఈ ఆటల ద్వారా  కొత్త ఫ్రెండ్స్​ని పొందుతున్నారు.  స్పోర్ట్ ​ఆడటం ఈ బిజీ లైఫ్​లో సోషలైజ్​ అవడానికి ఒక మార్గం. 

ఇది ఒక హెల్దీ కమ్యూనిటీ డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. అలాగే, ఎవరైనా ఫిట్​గా ఉంటేనే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలరు. ఈ మోడ్రన్​ కాలంలో మహిళలు శారీరక దృఢత్వాన్ని పెంచే పనులు అస్సలే చేయడం లేదు. అందుకే వాళ్లలో స్ట్రెంత్​ను పెంచే ఫిజికల్​ యాక్టివిటీస్ ​చాలా ముఖ్యమని గుర్తించాం. సిస్టర్ ​ఇన్ ​స్వెట్ ​ఆ గ్యాప్ ​ఫిల్ ​చేస్తోందని నమ్ముతున్నాం. మహిళల కోసం మహిళలతో నిర్వహిస్తున్న మా సంస్థ మంచి ఎంపవరింగ్​, పవర్​ఫుల్​ ఫ్లాట్​ఫామ్​ అవుతుంది.
-అనూష రావు , హైదరాబాద్​హెడ్​, సిస్టర్​ ఇన్​ స్వెట్​