నా చెల్లివే.. రోమియో మూవీ నుండి సిస్టర్ సెంటిమెంట్ సాంగ్

నా చెల్లివే.. రోమియో మూవీ నుండి సిస్టర్ సెంటిమెంట్ సాంగ్

విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ ‘రోమియో’. తెలుగులో ‘లవ్‌‌ గురు’ పేరుతో రిలీజ్ కానుంది. మృణాళిని రవి హీరోయిన్. విజయ్ ఆంటోనీ సొంత బ్యానర్‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘చెల్లెమ్మవే..’ అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు.

భరత్ ధనశేఖర్ ట్యూన్ చేసిన పాటకు  భాష్యశ్రీ లిరిక్స్ అందించగా, ఆదిత్య ఆర్కే పాడారు.  ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే.. నా చెల్లివే.. నువు నా చెల్లివే.. నేనున్నదే నీ కోసమే.. విధి రాసెనే, ఒక రాతనే.. ఆ ఆటలో ఎద కృంగెనే’ అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలతో ఎమోషనల్‌‌గా సాగుతుందీ పాట. సమ్మర్‌‌‌‌లో సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.