సితార చేతికి బ్లాస్ట్ జోన్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బ్లాస్టే

సితార చేతికి బ్లాస్ట్ జోన్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బ్లాస్టే

అర్జున్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్  ‘బ్లాస్ట్ జోన్’. అభిరామి,  ప్రీతి ముకుందన్ ముఖ్య పాత్రలు పోషించారు. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో  ఏజీఎస్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌పై కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్​ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించాడు. మే 28న సినిమా విడుదల కానుంది. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. 

ఈ సినిమా యాక్షన్, ఎమోషన్స్‌‌తో పాటు  మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్‌‌తో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా ఉండనుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్‌‌తో  రీసెంట్‌‌గా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.