శివాజీ లీడ్ రోల్లో బాలాజీ వీఆర్ దర్శకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ‘ఎమ్ 3’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో రవికృష్ణ, కసిరెడ్డి, భరణ్, ఖుష్బూ, రాధ్య, మౌనిక ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎస్టీబీఎల్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. 72 రోజుల పాటు సాగిన ఈ మూవీ షూటింగ్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో శివాజీ సంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపిస్తున్నాడు.
తన పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తిని ఈ లుక్ మరింత పెంచుతోంది. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కుటుంబమంతా కలిసి చూసి ఆనందించేలా, వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించేలా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. ప్రవీణ్ కె. పోతునూరి సంగీతం అందిస్తుండగా, వెంకట్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అశోక్ వడ్లమూడి, భాను మొగలిపువ్వు డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, త్వరలోనే టైటిల్‌ను రివీల్ చేయనున్నట్టు వెల్లడించారు. డిసెంబర్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
