- .కేసీఆర్ ఫామ్‌హౌస్ పక్కన భూములు ఎర్రవల్లి రికార్డులోకి మార్చారు
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌస్పక్కనే తమ గ్రామ భూములు ఉన్నాయని.. గత ప్రభుత్వ హయాంలో వాటి రికార్డులు తారుమారు చేశారని శివారు వెంకటాపూర్ గ్రామ స్తులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ గ్రామ భూ సమస్యను పరిష్కరించాలని, పట్టాదారు పాస్‌బుక్ అందించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో సర్వే నెం 41, 85, 88, 100లలో ఉన్న భూములను గ్రామ రికార్డులను నుంచి తొలగించి.. ఎర్రవెల్లి గ్రామ రికార్డు, నక్షలోకి మార్చారని తెలిపారు. ఆ భూముల్లో తాము వ్యవసాయం చేసుకుంటున్నట్లు చెప్పారు. 2015,-16 వరకు గ్రామ రికార్డుల్లో సదరు సర్వే నెంబర్లు ఉండేవని తెలిపారు.
వాటిని 2016-,17లో రికార్డ్ లో నుంచి తొలగించి సదరు సర్వే నెంబర్లు ఎర్రవెల్లి గ్రామ పరిధిలోని 325 సర్వేనెంబర్‌లో కలిపారని ఆరోపించారు. శివారు వెంకటాపూర్ గ్రామ రికార్డునకు నక్షా పటంనకు సర్వే నెం 41,85,88,100 మార్చి సరిహద్దులను చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివార్ వెంకటాపూర్ గ్రామస్తులు యాదగిరి, విఠల్, పోచయ్య, కరుణాకర్, రాములు, జహంగీర్, పర్వతాలు, కనకయ్య తదితరులు
పాల్గొన్నారు.
