జ్యోతిష్యం : జూన్ నెల చాలా అరుదైనది.. 6 గ్రహాలు మారుతున్నాయి.. 12 రాశులపైనా ప్రభావం..!

జ్యోతిష్యం : జూన్ నెల చాలా అరుదైనది.. 6 గ్రహాలు మారుతున్నాయి.. 12 రాశులపైనా ప్రభావం..!

జ్యోతిష్య  శాస్త్ర ప్రకారం గ్రహాలు.. ఒక రాశి నుంచి మరో రాశిలో మారుతుంటాయి.  గ్రహాల కదలికలను బట్టి.. జీవరాశులస్థితిగతులు మారతాయి. ఈ ఏడాది ( 2026) జూన్​ నెల చాలా  అరుదైనది. ఆరు గ్రహాలు వాటి స్థానాలు మారుతున్నాయి.  దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.  ఏ గ్రహం ఎప్పుడు ఏ రాశిలోకి మారుతుంది.  దానివలన ఎలాంటి ఎఫెక్ట్​ ఉంటుంది.  మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 2026  జూన్​ 2 వ తేదీన గురుడు, జూన్​ 8న శుక్రుడు  కర్కాటక రాశిలోకి... జూన్​ 15న సూర్యుడు మిథునరాశిలోకి.. జూన్​ 21 న కుజుడు వృషభ రాశిలోకి.. జూన్​ 22న కర్కాటకరాశిలోకి ప్రవేశించిన బుధుడు.. జూన్​ 29న వక్రగతిలోకి మారనున్నాడు. 

కర్కాటక రాశిలోకి ( జూన్​ 2 ) గురుడు:  తెలివితేటలు.. ఙ్ఞానానికి  అధిపతి అయిన  గురుడు.. భద్రతతో ముడి పడిన కర్కాటక రాశిలో సంచారం వలన   కుటుంబం అభివృద్ది విషయంలో కొంత భావోద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు.  దైవభక్తి.. సంపద పెరుగుతాయి. ఇతరుల పట్ల ఉదారంగా ఉండటం, పోషించే గుణం మరియు గొప్ప మానవతా విలువలు కలిగి ఉంటారు.ఆర్థిక పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. 

 కర్కాటక రాశిలోకి (జూన్​ 8)  శుక్రుడు:  కర్కాటకరాశిలో శుక్రుడు సంచరించే సమయంలో  భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంది.  సెంటిమెంట్​ విషయంలో అనేక ఆందోళనలు కలుగుతాయి.  రొమాంటిక్ కామెడీలకు, ఎక్కువ డిమాండ్ ఉంటుంది.  ఒంటరిగా ఉన్నవారు కేవలం ఒంటరితనాన్ని పోగొట్టుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 

 మిథున రాశిలోకి(జూన్​ 15) సూర్యుడు: సూర్య భగవానుడి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలన్నింటికీ రాజుగా భావించే సూర్యుడు.. మనిషి ఆత్మకు, గౌరవ మర్యాదలకు, ప్రభుత్వ రంగానికి కారకుడు. జ్యోతిష్య గణాంకాల ప్రకారం, సూర్యుడు 2026 జూన్ 15వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాలకు వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నారు. కొత్త కోర్సులు.. కొత్త ప్రాజెక్ట్​లు ప్రారంభమవుతాయి. 

 వృషభరాశిలోకి (జూన్​ 21)  కుజుడు :  వృషభ రాశిలో  కుజుడు సంచరించే సమయంలో స్థిరత్వం.. పట్టుదల.. ఆర్థిక అంశాలపై ప్రభావం చూపుతుంది.   భూమి కి సంబంధించి అనేక విషయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.   ఆవేశపూరిత చర్యలు .. సహనం, పట్టుదల, ఆచరణాత్మక నిర్ణయాలు అమలు చేస్తారు. ఈ సంచారం  స్థిరమైన పురోగతి కలుగుతుంది. అకాల వర్షాలతో  అనేక మార్పులు సంభవిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడే  అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుజుడు ప్లూటోతో చతురస్ర కోణంలోకి వస్తాడు.  ఇది ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తుంది. 

 కర్కాటక రాశిలోకి (జూన్​ 22) బుధుడు : బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది మేధస్సు, వ్యాపారం, భావోద్వేగం, అంతర్ దృష్టి ,  ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.మనసు చురుకుగా ఉండి.. ప్రతి విషయాన్ని లాజిక్​తో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  కుటుంబంతో మాటలు పెరుగుతాయి . భావోద్వేగం సమస్యలు పెరుగుతాయి.  ఓవర్ థింకింగ్  వలన చిన్న విషయానికి కూడా ఎక్కువ ఫీల్అవుతారు. 

కర్కాటకరాశిలో బుధుడు తిరోగమనం( జూన్​ 29 ) :కర్కాటక రాశిలో బుధుడు వక్రగతి (తిరోగమనం) చెందడం వల్ల ఆలోచనల్లో స్పష్టత లోపించడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు మరియు నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వంటివి ఎదురవుతాయి. ఈ సమయంలో  ముఖ్యమైన లావాదేవీలలో ఆచితూచి అడుగువేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్​ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈసమయంలో ప్రతి విషయంలో సమీక్ష, ఆత్మపరిశీలన  చాలా అవసరం .  ఇతరులతో మాట్లాడేటప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.