
బయటకు వెళ్లాలంటే చాలామంది ఇబ్బంది పడతారు. ఫేస్‌పై ఉండే మచ్చల.. మొటిమలు.. ముడతల వల్ల ఎక్కడకువెళ్లలేరు. మేకప్ వేసుకున్నా సరే ఇబ్బందిగా ఫీలవుతారు. మచ్చలను.. మొడిమల స్పాట్స్ ను.. ముడతలను వంటింటి చిట్కాలు ఉపయోగించి చర్మాన్ని ఉంచుకోవచ్చు. వీటన్నింటిని ఒక్కసారిగా పోగొట్టుకోలేం. కానీ, కొన్ని ప్రయత్నాలు చేస్తే ఈజీగానే సమస్యని దూరం చేసుకోవచ్చు. అందులో ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి. వీటిలో భాగంగా బంగాళాదుంపని వాడి ముఖంపై ఉన్న సమస్యల్ని ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకోండి.
ముఖానికి బంగాళాదుంప రసంని వాడితే చాలా మార్పులు కనిపిస్తాయి. దీనిని రెగ్యులర్‌గా, కనీసం వారంలో 2 రోజులు వాడితే స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకూ తగ్గుతాయి. స్కిన్ కూడా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. .
విటమిన్ సి : బంగాళదుంప రసంలో ప్రకాశింపజేసే లక్షణాలు ఎక్కువుగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి మెలనిన్ అనే ఓ రకమైన కొవ్వు పదార్దాన్ని తగ్గిస్తుంది. దీనివలన శరీరంపై నల్లమచ్చలు తగ్గుతాయి. రోజూ రాత్రి సమయంలో బంగాళ దుంప రసాన్ని ఫేస్‌కు పట్టించి.. మచ్చలున్న ప్రాంతంలో దీనితో మాలిష్ చేయాలి. క్రమేణ మచ్చలు మటుమాయం అయి.. చర్మం అందంగా ఉంటుంది.
ఫ్రీ రాడికల్స్....యాంటీఆక్సిడెంట్‌లు: బంగాళదుంప రసంలో ఉండే ఫ్లేవనాయిడ్లు .. ఫ్రీ రాడికల్స్....యాంటీఆక్సిడెంట్‌లు.. చర్మంపై కలిగే ఒత్తిడిని తగ్గిస్తాయి. పిగ్మేంటేషన్ సమస్యలనుంచి కాపాడుతుంది. వృద్దాప్యంలో చర్మంపై ఏర్పడే ముడుతలను నివారిస్తుంది. చర్మం కాంతివంతంగా ఉంచేందుకు బంగాళదుంప రసం కీలకపాత్రపోషిస్తుంది.
ఎంజైమ్‌లు: బంగాళదుంప రసంలో అనేక ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి హెల్దీ చర్మకణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుది. చర్మ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మంపై ఏర్పడిన అలెర్జీని తగ్గిస్తుంది. మొటిమల మచ్చలను తొలగిస్తుంది.
చర్మం కాంతివంతంగా: బంగాళదుంప రసం స్కిన్ బ్లీచింగ్ ఏజంట్ గా పని చేస్తుంది. మొటిమలు.. వృద్యాప్యం వలన ఏర్పడే స్పాట్స్ ను తొలగిస్తుంది. పొటాటో ఉండే స్టార్చ్ కంటెంట్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
చర్మం హైడ్రేట్ గా : బంగాళదుంప రసం చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది. చర్మం మంటగా ఉంటే ఈ రసం అప్లై చేస్తే ఉపశమనం కలుగుతుంది. . పొడి బారిన చర్మం.. ఎర్రబడిన చర్మం ఉన్నవారికి బంగాళదుంప రసం చాలా ఉపయోగపడుతుంది. చర్మంపై చిన్న చిన్న పుండ్లను తగ్గిస్తుంది.
నల్లటి వలయాలు..కళ్ళ కింద బంగాళాదుంప రసం లేదా బంగాళాదుంప ముక్కలను పూయడం వల్ల నల్లటి వలయాల సమస్య తగ్గుతుంది. ఇది వాపును తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.