పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బలూచిస్తాన్ మద్దతుదారుల సెగ

పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బలూచిస్తాన్ మద్దతుదారుల సెగ

అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ప్రధానమమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానాలు ఎదురవతున్నాయి. ఇమ్రాన్ ఎక్కడికి వెళ్లినా బలూచిస్తాన్ మద్దతుదారులు అడ్డుకుంటున్నారు. నిన్న వాషింగ్టన్ డీసీలో ఓ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. పాక్ ప్రధాని బసచేసిన హోటల్ ముందు నిరసన తెలిపారు. బలూచిస్తాన్ ప్రాంతంలో పాక్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అమెరికా పర్యటనకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ను స్వాగతం చెప్పేందుకు ఒక్క అమెరికా మంత్రి కూడా వెళ్లలేదు.