ఇంట్లో వాషింగ్ మెషిన్ లేదా.. మీకోసమే ఈ హ్యాండీ వాషింగ్‌‌‌‌‌‌‌‌ మెషిన్‌‌‌‌‌‌‌‌

ఇంట్లో వాషింగ్ మెషిన్ లేదా.. మీకోసమే ఈ  హ్యాండీ వాషింగ్‌‌‌‌‌‌‌‌ మెషిన్‌‌‌‌‌‌‌‌

ఇంట్లో వాషింగ్‌‌‌‌‌‌‌‌ మెషిన్‌‌‌‌‌‌‌‌ లేనివాళ్లు బట్టలు ఉతుక్కోవడానికి చాలా కష్టపడుతుంటారు. అలాంటివాళ్లకు ఇది బెస్ట్‌‌‌‌‌‌‌‌ చాయిస్‌‌‌‌‌‌‌‌. వాషింగ్‌‌‌‌‌‌‌‌ మెషిన్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే చాలా తక్కువ ధరకే ఇది దొరుకుతుంది. జెనరిక్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ మెషిన్‌‌‌‌‌‌‌‌ని 30 లీటర్ల నీళ్ల బకెట్‌‌‌‌‌‌‌‌లో వాడుకోవచ్చు. చిన్న సైజు బకెట్ ఉపయోగిస్తే బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు బయటకు వస్తాయి. బకెట్‌‌‌‌‌‌‌‌కు మెషిన్‌ని బిగించి, నీళ్లు నింపాలి. అందులో డిటర్జెంట్, బట్టలు వేయాలి. 

తర్వాత పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి ఆన్‌‌‌‌‌‌‌‌ చేస్తే చాలు. ఇది బకెట్‌‌‌‌‌‌‌‌లో నురగను క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. 3–4 నిమిషాల్లో బట్టలు ఉతికేస్తుంది. ఈ మెషిన్‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెషిన్‌‌‌‌‌‌‌‌లోని స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువ వేడెక్కితే ఆఫ్‌‌‌‌‌‌‌‌ అయిపోవడానికి ఆటో కట్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉంది.

ధర: 2838