రోజూ వర్కౌట్స్ చేసేవారికోసం.. స్మార్ట్ బాడీ మెజరింగ్ టేప్‌‌‌‌‌‌‌‌

రోజూ వర్కౌట్స్ చేసేవారికోసం.. స్మార్ట్ బాడీ మెజరింగ్ టేప్‌‌‌‌‌‌‌‌

కొంతమంది ఎప్పుడూ ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి అనుకుంటారు. అందుకే రోజూ వర్కవుట్స్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు వెయిట్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంతోపాటు బైసెప్స్, తొడలు, నడుము, భుజాలు, మెడ, పొట్టని టేప్‌‌‌‌‌‌‌‌తో కొలుస్తూ ఉంటారు. అలాంటివాళ్లకు ఈ స్మార్ట్ బాడీ మెజరింగ్ టేప్‌‌‌‌‌‌‌‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కేసన్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ టేప్‌‌‌‌‌‌‌‌ ఒక చిప్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. అది కచ్చితమైన కొలతలను నిర్ధారిస్తుంది. ఆ కొలతలను చూసుకోవడానికి దీనికి ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ  డిస్‌‌‌‌‌‌‌‌ప్లే కూడా ఉంటుంది. 

బ్లూటూత్ ద్వారా దాన్ని ఫిట్‌‌‌‌‌‌‌‌డేస్ అనే యాప్‌‌‌‌‌‌‌‌తో కనెక్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. మెజర్ చేసిన ప్రతిసారి ఆ డేటాని సేవ్‌‌‌‌‌‌‌‌ చేసుకుని, ఎప్పటికప్పుడు యాప్‌‌‌‌‌‌‌‌కి పంపుతుంది. దీనివల్ల వీక్లీ, మంత్లీ డేటాని ట్రాక్‌‌‌‌‌‌‌‌ చేయడం ఈజీ అవుతుంది. అంతేకాదు.. ఇది బాడీలోని కొలెస్ట్రాల్‌‌‌‌‌‌‌‌ శాతాన్ని కూడా లెక్కిస్తుంది. దీన్ని వాడడం కూడా చాలా ఈజీ. టేప్‌‌‌‌‌‌‌‌ని బయటికి లాగి హుక్‌‌‌‌‌‌‌‌కి తగిలిస్తే సరిపోతుంది. ఇందులో రీచార్జబుల్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ ఉంటుంది. టైప్‌‌‌‌‌‌‌‌సీ కేబుల్‌‌‌‌‌‌‌‌తో చార్జింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవచ్చు. 

ధర: 1,786