మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ సెంచరీతో ఆకట్టుకుంది. 2026 అక్టోబర్ 25న వడోదరలో జింబాబ్వేతో జరిగిన రెండో వండేలో సెంచరీతో జట్టును ఆదుకున్నారు. కెప్టెన్ స్మృతి మంధాన ఆమెకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అభినందించారు. హర్మన్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాక ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టేలా స్మృతి రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి 19/2 డిఫెన్స్ లో పడింది. స్మృతి మంధాన, షఫాలి వర్మ త్వరగా అవుట్ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రతికా రావల్‌తో కలిసి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.
హర్మన్‌ప్రీత్ 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. ఆ తర్వాత 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు చేశారు. ఆమెను మిచెల్ మవుంగా బౌలింగ్‌లో అవుట్ చేశారు. జూన్ 2024 తర్వాత హోమ్ గ్రౌండ్ లో హర్మన్ కు ఇది తొలి సెంచరీ . ఇండియన్ మహిళా వన్డే సెంచరీల్లో మిథాలీ రాజ్‌ను అధిగమించి ఆమె రెండో స్థానానికి చేరుకున్నారు. స్మృతి మంధాన 14 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా హర్మన్ రెండో స్థానంలో ఉన్నారు.
మాజీ కెప్టెన్‌గా, ప్రస్తుత కెప్టెన్‌గా వారి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న క్రమంలో ఈ స్టాండింగ్ ఓవేషన్ ప్రత్యేకంగా ఆకర్శించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో స్మృతి మంధాన నిలబడి హర్మన్‌ప్రీత్‌ను అభినందించిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఇటీవల టీ20 సిరీస్‌లోనూ హర్మన్‌ప్రీత్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. అక్టోబర్ 20న జరిగిన మూడో టీ20లో 41 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. ఆ ఫామ్‌ను వన్డేలోనూ కొనసాగించారు.
🎥 Vadodara rises to applaud a Harmanpreet Kaur special 🤩 Updates ▶️ https://t.co/ECnfLgdfi7 #TeamIndia | #INDvZIM | @mflone_ | @ImHarmanpreet https://t.co/YoEXIqHJtz
— BCCI Women (@BCCIWomen) October 25, 2026
