గోదావరిఖని పోలీస్ స్టేషన్ ముందు పాము హల్ చల్

గోదావరిఖని పోలీస్ స్టేషన్ ముందు పాము హల్ చల్

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పోలీస్ స్టేషన్ ముందు పాము హల్ చల్ చేసింది. పీఎస్ కు ఎదురుగా ఉన్న చెట్టుపై నుంచి పడి కొద్దిసేపటి వరకు రోడ్లపై తిరుగుతూ.. ఓ కారులో చొరబడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కారులో చొరబడిన పామును బయటికి తీశారు స్నేక్ క్యాచర్. తర్వాత పామును అడవిలో వదిలేశారు.