పిల్లలు ఎలా వాడుతున్నారో పేరెంట్స్ తెలుసుకునేలా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది స్నాప్ చాట్. ఇప్పటికే ఫ్యామిలీ సెంటర్ హబ్ ద్వారా పిల్లల యాక్టివిటీని గమనిస్తున్నారు. ప్రతిరోజు ఎంత టైం వాడుతున్నారో కూడా తెలుస్తుంది. ఇప్పుడు చాటింగ్, పోస్టింగ్, కెమెరా ఫీచర్లతో క్రియేటింగ్, స్నాప్ మ్యాప్ వాడకం, కంటెంట్ చూడడం వంటివి తెలుసుకోవచ్చు. స్క్రీన్ టైం, ఆన్లైన్ అలవాట్ల గురించి పేరెంట్స్ తమ పిల్లలతో డిస్కస్ చేయొచ్చు.
టీనేజర్లు తమ ఫ్రెండ్స్‌ను కూడా ట్రాక్ చేయొచ్చు. స్నాప్ చాట్ మీద కొత్త ఫ్రెండ్స్ యాడ్ అయినప్పుడు వాళ్లు మ్యూచువల్ ఫ్రెండ్స్ అయినా, గతంలో కాంటాక్ట్‌లో సేవ్ అయిన వాళ్లైనా వెంటనే తెలుస్తుంది. ఫ్యామిలీ సెంటర్ టూల్స్‌ను వాడుకోవడంలో పేరెంట్స్‌కు సాయం చేయడానికి భద్రత, అవేర్నెస్ వీడియోను స్నాప్‌చాట్ రిలీజ్ చేసింది.
స్ట్రిక్ట్ అకౌంట్తో సేఫ్!
మామూలుగా వాట్సాప్‌లో తెలియని వ్యక్తి నుంచి వచ్చిన మీడియా ఫైల్స్, అటాచ్మెంట్స్ బ్లాక్ అవుతాయి. లింక్ ప్రివ్యూలు ఆగిపోతాయి. చాట్‌లో యూఆర్ఎల్ షేర్ చేసినప్పుడు కనిపించే థంబ్ నెయిల్స్, తెలియని వ్యక్తి నుంచి కాల్స్ సైలెంట్ మోడ్‌లో పెట్టడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అడ్వాన్స్డ్ సైబర్ దాడుల నుంచి ఈ ఫీచర్ రక్షిస్తుంది. ప్రస్తుతం ఈ సేఫ్టీ ఫీచర్లు వేరే వేరే ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
కానీ ఒకేచోట ఉండేలా ఈ స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్‌ను వాడొచ్చు. దీంతో ఒకే ఒక్క ట్యాప్‌తో పని అయిపోతుంది. దీన్ని ఎలా వాడాలంటే.. వాట్సాప్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌కు వెళ్లాలి. అందులో ప్రైవసీ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి. అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, అక్కడ స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్‌పై ట్యాప్ చేయాలి. దీంతో ఆ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సైబర్ మోసాల వలలో పడకుండా కాపాడుతుంది. ఒకవేళ ఈ ఆప్షన్ కనిపించకపోతే యాప్‌ను అప్డేట్ చేయండి.
